Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పొరపాటున కూడా నేరేడు పండును వీటితో కలిపి తీసుకోవద్దు!

నేరేడు పండును ఎక్కువగా తీసుకోవడంవల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఇతర పదార్థాలతో కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

రోజురోజుకు పెరుగుతున్న ఎండలు అందరినీ అతలాకుతలం చేస్తున్నాయి. చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. వేసవి కాలంలో పుష్కలంగా లభించే కొన్ని పండ్లు ఉన్నాయి. అవి తీసుకుంటే వడదెబ్బ నుంచి రక్షణ కల్పించడమే కాక మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. నేరేడుతోపాటు పుచ్చకాయ, దోసకాయ కూడా ఆరోగ్యానికి మంచిది. పలు వ్యాధుల ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరం సరైన రీతిలో పనిచేయడానికి ఇవి సహాయపడతాయి. చాలా రుచిగా ఉండే ఈ పండు కోసం ఏడాది కాలం వేచిచూడాల్సిందే. అనేక ఔషధ గుణాలతోపాటు షుగరు, రక్తహీనత, ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలను నియంత్రించడంతో సహాయపడతాయి. నేరేడు పండు ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

 apricot

* నేరేడు పండుతో పాటు పసుపును కలిపి తీసుకోకూడదు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండు తిన్న వెంటనే పసుపు తీసుకోకూడదు. ఈ రెండూ కలవడంవల్ల కడుపు నొప్పి వస్తుంది. ఈ రెండింటి మధ్య కనీసం 30 నిమిషాల అంతరం ఉండాలి.

* నేరేడు పండు,పాలు కలిపి తీసుకోకూడదు. నేరేడుతో పాలు తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. వాటిని ఒకేసారి తింటే జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా గ్యాస్ పెరుగుతుంది.

* పచ్చళ్లు, నేరేడు పండు కలిపి తీసుకోకూడదు. ఈ రెండింటి కలయిక విష ప్రభావానికి గురిచేస్తుంది. విరేచనాలు, అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వస్తాయి. ఈ రెండింటి మధ్య కనీసం 30 నిమిషాల అంతరం ఉండాలి.

* నేరేడు పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీని పెంచడంతోపాటు విరేచనాలను కలగజేస్తుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం మాత్రమే తీసుకోవాలి. శరీర ఉదర కుహరం, ఆహార పైపు, మెడను దెబ్బతీయడంతోపాటు కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+