అసిడిటీతో అల్లాడిపోతున్నారా.. ఇదిగో సత్వరం తగ్గించే హోం రెమెడీస్!
అసిడిటీ అనేది చాలా మందికి సాధారణ సమస్యగా మారిపోయింది. గ్యాస్ట్రిక్ గ్రంథులు ఎక్కువ మోతాదులో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం వల్ల ఏర్పడుతుంది. సాధారణంగా, ఆమ్లం జీర్ణక్రియకు అవసరమయ్యే సహజ రసాయనం అయినప్పటికీ, ఇది అధిక మోతాదులో ఉత్పత్తి అయితే పేగు గోడలపై ప్రభావం చూపించి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీనివల్ల కడుపులో మంట, నొప్పి, పుల్లటి తేన్పులు, ఛాతీలో మంట వంటి సమస్యలు వస్తాయి. అధికమైన అసిడిటీ ఉంటే తలనొప్పి, వాంతులు కూడా రావచ్చు. అయితే, కొన్ని సహజ సిద్ధమైన ఇంటి చిట్కాలతో అసిడిటీని తగ్గించుకోవచ్చు.
అసిడిటీని కలిగించే ప్రధాన కారణాలు:
వేళకు ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా కారం, మసాలాలు, నూనెతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం. కార్బొనేటెడ్ డ్రింక్స్ (సోడాలు, కోక్) ఎక్కువగా తాగడం. ఆల్కహాల్, ధూమపానం అలవాటు అసిడిటీని కలిగిస్తాయి. రోజువారి జీవనశైలిలో మార్పులు రావడం కూడా కడుపులో మంట, అసిటిడీ సమస్యలకు కారణమవుతుంది. ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉండటం, తగినంతగా నీరు తాగకపోవడం,
నిద్రలేమి, సరిగ్గా నడక, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలు సమస్యలను పెంచుతాయి. ఎక్కువగా కాఫీ, టీ తీసుకోవడం, ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండడం, కొంతమందికి గ్యాస్ట్రిక్ సమస్యలకు జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
వేళకు ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా కారం, మసాలాలు, నూనెతో చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అధిక బరువు కూడా అసిడిటీకి కారణం కావచ్చు. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ధూమపానం , మద్యపానం అసిడిటీని పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
ఇంటి చిట్కాలు:
సోంపు గింజలను నమలడం వల్ల అసిడిటీ తగ్గుతుంది. పుదీనా ఆకులు జీర్ణక్రియకు సహాయపడతాయి. అసిడిటీని తగ్గిస్తాయి. పుదీనా ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగవచ్చు. అల్లం జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది అసిడిటీని కూడా తగ్గిస్తుంది. అల్లం ముక్కను నమలవచ్చు లేదా అల్లం టీ తాగవచ్చు. తులసి ఆకులు అసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయి. తులసి ఆకులను నమలవచ్చు లేదా తులసి టీ తాగవచ్చు. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది అసిడిటీని తగ్గిస్తుంది. భోజనం తర్వాత పెరుగు తినడం మంచిది. చల్లటి పాలు తాగడం వల్ల అసిడిటీ తగ్గుతుంది.
నిమ్మరసం-తేనె:
నిమ్మరసం అసిడిటీని పెంచుతుందని చాలామంది అనుకుంటారు, కానీ ఇది నిజం కాదు. నిమ్మరసం జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు అసిడిటీని తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం పిండి వేసుకుని తాగవచ్చు. కొబ్బరి నీరు అసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. అరటిపండులో పొటాషియం ఉంటుంది, ఇది అసిడిటీని తగ్గిస్తుంది. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు అసిడిటీని తగ్గిస్తుంది. తేనె అసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక చెంచా తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా అసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక గ్లాసు నీటిలో కలిపి తాగవచ్చు.
ఈ వంటింటి చిట్కాలు సాధారణంగా అసిడిటీని తగ్గించడానికి సహాయపడతాయి. మీకు తరచుగా అసిడిటీ వస్తుంటే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొన్ని సందర్భాలలో, అసిడిటీకి కారణం ఇతర ఆరోగ్య సమస్యలు కావచ్చు. కాబట్టి వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.












Click it and Unblock the Notifications