మైగ్రేన్‌ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఇలా ట్రై చేస్తే చాలు!

మైగ్రేన్ తలనొప్పి చాలా మందిని బాధించే ఒక సాధారణ సమస్య. ఇది ఒక రకమైన తీవ్రమైన తలనొప్పి, ఇది తరచుగా తలకి ఒకవైపు మాత్రమే వస్తుంది. మైగ్రేన్ నొప్పి కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఈ నొప్పి వెలుతురు, శబ్దాలు మరియు వాసనలకు సున్నితత్వాన్ని కలిగిస్తుంది. వికారం మరియు వాంతులు కూడా సాధారణ లక్షణాలు. మైగ్రేన్ ఎందుకు వస్తుంది మరియు దానిని ఎలా తగ్గించాలో వివరంగా తెలుసుకుందాం:

మైగ్రేన్ రావడానికి గల కారణాలు:
మైగ్రేన్‌కు కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి.కుటుంబంలో ఒకరికి మైగ్రేన్ ఉంటే, ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్లలో మార్పులు మైగ్రేన్‌కు కారణమవుతాయి. అంతే కాకుండా వాతావరణ మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మహిళల్లో, ఋతు చక్రం, గర్భం , రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మైగ్రేన్ రావచ్చు. మానసిక ఒత్తిడి మైగ్రేన్‌కు ఒక సాధారణ కారణం అవుతుంది. నిద్ర విధానాలలో మార్పులు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. కొన్ని రకాల ఆహారాలు (చాక్లెట్, చీజ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు) , పానీయాలు (ఆల్కహాల్, కెఫిన్) మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం లేదా అకస్మాత్తుగా ఆపేయడం వల్ల తలనొప్పి వస్తుంది. వాతావరణ పీడనంలో మార్పులు, తుఫానులు, బలమైన గాలులు కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు.

Are you suffering from migraine headaches Try this

మైగ్రేన్ లక్షణాలు:
మైగ్రేన్‌ ప్రధానంగా తలకి ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. ఒక్కొసారి కళ్ళకు మసకపట్టడం లేదా వెలుగుల్ని చూడలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వాంతులు లేదా వాంతి భావన కలుగుతుంది. శరీరానికి బలహీనతకు గురవుతుంది. శబ్దం , వెలుతురుకు విపరీతమైన సున్నితత్వం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది.

మైగ్రేన్ తగ్గించడానికి చిట్కాలు:
మైగ్రేన్ తలనొప్పితో సతమతమవుతున్నప్పుడు ప్రశాంతమైన, చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి. నొప్పి ఉన్న చోట చల్లటి కాపడం పెట్టాలి. పుష్కలంగా నీరు త్రాగాలి. యోగా, ధ్యానం మరియు శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవడం, మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. మైగ్రేన్‌ను ప్రేరేపించే ఆహారాలు , పానీయాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్), ట్రిప్టాన్స్ మరియు ఇతర మందులు ఉపయోగించవచ్చు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి:
మైగ్రేన్ సమస్య అనేది పూర్తిగా నయం చేయడం కష్టమైనదైనా, మనం జీవనశైలి మార్పులు మరియు సరైన మందులు ఉపయోగించడం ద్వారా దానిని నియంత్రించవచ్చు. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండింటిపైన శ్రద్ధ పెట్టడం మైగ్రేన్ బాధను తగ్గిస్తుంది. తగిన డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యమైంది. తరచుగా , తీవ్రమైన మైగ్రేన్ వస్తున్నా, నొప్పి మందులకు తగ్గకపోయినా, చూపులో ఆకస్మిక మార్పులు, మాటల్లో తడబాటు, బలహీనత వంటి లక్షణాలు ఉంటే డాక్టర్ ను సంప్రదిండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+