లిప్ స్టిక్స్ వాడుతున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో.. తెలుసుకోండి!

చాలామంది అమ్మాయిలు, మహిళలు లిప్ స్టిక్ వాడుతూ ఉంటారు. కొంతమంది పెదవులకు లిప్ స్టిక్ వేయకుంటే అసలు బయటకు వెళ్లరు. మేకప్ చేసుకోవటం, లిప్ స్టిక్స్ వాడటం ఇప్పుడు అమ్మాయిలకు ఒక అడిక్షన్ లా తయారైంది. లిప్ స్టిక్ కి అమ్మాయిలు చాలా ప్రాధాన్యతనిస్తున్నారు .అయితే ఇవి ఎక్కువగా వాడడం వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక వాటిని గురించి తెలుసుకుందాం.

లిప్ స్టిక్ తో అనారోగ్య సమస్యలు
లిప్ స్టిక్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రతిరోజు లిప్ స్టిక్ ఉపయోగించేవారు తమకు తెలియకుండానే దానిని మింగేస్తూ ఉంటారు. లిప్ స్టిక్ కడుపులోకి పోవడం వల్ల దాని ప్రభావం మన జీర్ణ వ్యవస్థ పైన కచ్చితంగా పడుతుంది. ఎక్కువగా దీనిని వినియోగించేవారు భవిష్యత్తులో జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Are you using lipstick But your health is at risk Know the details

లిప్ స్టిక్స్ తో ఈ జబ్బులకు ఛాన్స్
ఇక కొన్ని రకాల లిప్ స్టిక్స్ లో 10 పి పి యం సీసం ఉంటుంది. ఇంత స్థాయిలో పిపిఎం సీసం ఉంటే అది మన ఆరోగ్యం పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గర్భాశయానికి సంబంధించిన సమస్యలకు కారణమవుతుంది. దీని కారణంగా క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

లిప్ స్టిక్స్ మెదడు ఆరోగ్యంపైన ప్రభావం
లిప్ స్టిక్స్ లో ఉపయోగించే కెమికల్స్ కారణంగా మన నాడీ వ్యవస్థ పైన కూడా ప్రభావం పడుతుంది. ఇది మన మెదడు ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. లిప్ స్టిక్స్ పునరుత్పత్తి వ్యవస్థ పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణంగా మారుతుంది. ఇక ఎవరైతే ఎక్కువ లిప్ స్టిక్ లను ఉపయోగిస్తారో వాటిలో ఉండే రసాయన మూలకాల కారణంగా చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

లిప్ స్టిక్స్ విషయంలో జాగ్రత్త
ఇక ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు లిప్ స్టిక్ లను ఉపయోగించకుండా ఉంటేనే మంచిది. లిప్ స్టిక్ లో ఉండే లెడ్, అల్యూమినియం, క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం శరీరంలోకి చేరితే చాలా ప్రమాదం కనుక లిప్ స్టిక్స్ వినియోగించే విషయంలో మహిళలు జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు లిప్ స్టిక్స్ వాడకుండా ఉంటేనే మంచిది. అలా కాకుండా ఒకవేళ వాడితే నాసిరకం లిప్ స్టిక్స్ ను అసలే వాడకండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+