తెలంగాణ స్టైల్ 'బగారా రైస్'.. ఇలా చేస్తే టేస్ట్ జంపర్ మే బంపర్..
బగారా రైస్ అనగానే చాలామందికి నోరూరుతుంది. బగారా రైస్ చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక తెలంగాణలో అయితే ఫంక్షన్ ఏదైనా బాగారా రైస్ కచ్చితంగా ఉండాల్సిందే. మరి ఇంట్లోనే ఈజీగా బాగారా రైస్ తయారు చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతోనే సూపర్ టేస్టీగా బగారా రైస్ చేసుకోవచ్చు. మరి తెలంగాణ స్టైల్ బగారా రైస్ తయారీ విధానం ఏంటి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
తెలంగాణ స్టైల్ బగారా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బాస్మతి బియ్యం రెండు కప్పులు, ఉల్లిపాయలు రెండు మీడియం సైజులో, పచ్చిమిర్చి నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్, పుదీనా ఆకులు అరకప్పు, కొత్తిమీర ఆకులు అర కప్పు, పెరుగు అరకప్పు, ఉప్పు రుచికి సరిపడా, నూనె ప్లస్ నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్ లు, నీరు 3.5 కప్పులు, బిర్యానీ ఆకు ఒకటి, లవంగాలు నాలుగు, యాలకులు మూడు, దాల్చిన చెక్క ఒకటి చిన్న ముక్క, షాజీరా అర టీ స్పూన్ తీసుకోవాలి.
ఇక బగారా రైస్ తయారీ విధానం చూస్తే.. ముందుగా బియ్యాన్ని కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత అందులో మొత్తం స్పైసెస్ దినుసులు వేయాలి. అలా వాటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మంచి వాసన వచ్చేంత వరకూ కలుపుకోవాలి.

ఆ తర్వాత అందులో పుదీనా, పెరుగు, కొత్తిమీర వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో బియ్యం వేసి రెండు నిమిషాలపాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో నీరు, ఉప్పు వేసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. చివరగా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే సరి సూపర్ టేస్టీ బగారా రైస్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications