సమ్మర్ స్పెషల్ 'బనానా జ్యూస్'.. తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచి..!
మండు వేసవిలో చాలా మంది పండ్లు, జ్యూస్ లు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు రోడ్ సైడ్ ఉన్న జ్యూస్ పాయింట్ల వద్ద వాలిపోతుంటారు. అయితే చాలా జ్యూస్ లు ఉన్నప్పటికీ బానానా జ్యూస్ చాలా ప్రత్యేకం. వేసవిలో బనానా జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. అయితే బయట జ్యూస్ పాయింట్ల వద్ద దొరికే బానానా జ్యూస్ కాకుండా ఇంట్లోనే ఈజీగా బనానా జ్యూస్ తయారు చేసుకోవచ్చు. అందుకు కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం ఇక్కడ చూడండి..
సమ్మర్ స్పెషల్ బనానా జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. అరటిపండ్లు రెండు, పాలు ఒక కప్పు, చక్కెర రెండు టేబుల్ స్పూన్ లు, ఐస్ క్యుబ్స్ నాలుగు, యాలకుల పొడి చిటికెడు అంతే కేవలం ఐదు పదార్థాలతోనే సూపర్ టేస్టీ బానానా జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఇక బనానా జ్యూస్ తయారీ విధానం చూస్తే.. ముందుగా అరటి పండ్లను తొక్క తీసి ముక్కలుగా చేయండి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలో అరటి ముక్కలు వేయాలి. అందులోనే తగినన్ని పాలు పోయాలి.

ఇప్పుడు ఆ రెండింటినీ మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో ఐస్ క్యూబ్స్, యాలకుల పొడి వేసి మళ్లీ బ్లెండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మరోసారి జ్యూస్ మెత్తగా అయ్యేంత వరకూ బ్లెండింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత జ్యూస్ ను గ్లాస్ లోకి తీసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ బనానా జ్యూస్ రెడీ అయినట్టే.. మీరూ ఇలా ట్రై చేయండి..












Click it and Unblock the Notifications