"కోడిగుడ్డు - బీట్‌రూట్" ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా.. ఈజీగా ఎలా చేయాలంటే ???
మారుతున్న కాలానుగుణంగా మనుషుల ఆహారపు అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. ఏమంటూ వచ్చిందో కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలకు ఆరోగ్యం పట్ల మరింత మక్కువ పెరిగింది. ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో సాధారణ వంటకాలకు పోషకాలను కలిపి తయారుచేసే రెసిపీలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఆ కోవలోకే వస్తుంది ఇప్పుడు చెప్పుకోబోయే వంటకం. అద్భుతమైన, ఆరోగ్యకరమైన వంటకం కోడిగుడ్డు - బీట్‌రూట్ ఫ్రై (Beetroot Egg Bhurji). తురిమిన బీట్‌రూట్‌ను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వంటి వాటితో వేయించి, ఆపై గుడ్లు కలపడం ద్వారా వంటకానికి సహజమైన రంగు, మెరుగైన రుచి చేరతాయి.
బీట్‌రూట్‌లో ప్రోటీన్ శాతం తక్కువగా ఉంటుంది. అందుకే గుడ్డుతో కలపడం ద్వారా ఈ లోటును పూరించవచ్చు. ఈ కలయిక వల్ల శరీరానికి అవసరమైన అమినో ఆసిడ్స్ అన్నీ అంది, పూర్తి ప్రోటీన్ లభిస్తుంది. ఇది కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్ల మధ్య సరైన సమతుల్యతను అందిస్తుంది. ఇది కేవలం 25-30 నిమిషాల్లో సిద్ధమయ్యే వంటకం. గుడ్లలోని ప్రోటీన్‌తో పాటు బీట్‌రూట్‌లో ఉన్న విటమిన్, ఫైబర్ కలయిక కారణంగా.. ఇది బ్రేక్‌ఫాస్ట్, లంచ్, లేదా డిన్నర్ ఏ సమయంలోనైనా సంపూర్ణ పోషకాహార ఎంపికగా నిలుస్తుంది. ఈ భుర్జీని అన్నం, రోటీ/చపాతీ, దోసె లేదా పూల్కాతో పాటు శాండ్‌విచ్‌లు లేదా రాప్‌ల ఫిల్లింగ్‌గా లేదా బ్రెడ్ టోస్ట్‌పై స్ప్రెడ్‌గా కూడా వాడుకోవచ్చు.

బీట్‌రూట్ ఎగ్ భుర్జీ తయారీ విధానం (రెసిపీ)..
అవసరమైన పదార్థాలు..
- బీట్‌రూట్: 250 గ్రాములు (తాజాగా తురిమినది)
- గుడ్లు: 3 లేదా 4
- ఉల్లిపాయ: 1 (చిన్నగా తరిగినది)
- పచ్చిమిర్చి: 2 (లేదా రుచికి తగినంత)
- పోపు కోసం: ఆవాలు, శనగపప్పు, కరివేపాకు (ఐచ్ఛికం)
- మసాలాలు: ఉప్పు, ఎర్ర కారం (ఐచ్ఛికం)
- కొత్తిమీర - కొంచెం
- నూనె - సరిపడా
తయారీ పద్ధతి..
- ముందుగా పాన్ వేడి చేసి నూనె వేయాలి. ఆ తర్వాత ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేసి వేయించాలి.
- శనగపప్పు బంగారు రంగులోకి మారిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయలు బాగా అయ్యే వరకు వేయించాలి.
- ఇప్పుడు తురిమిన బీట్‌రూట్‌ను వేసి, ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఆపై మూత పెట్టి, బీట్‌రూట్ మృదువుగా అయ్యే వరకు సుమారు 5 నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు మూత తీసి, బీట్‌రూట్‌లో అదనంగా ఉన్న తేమ మొత్తం ఆవిరైపోయేలా మరో 2 నిమిషాలు వేగంగా ఫ్రై చేయాలి.
- పాన్‌లో నేరుగా గుడ్లు పగలగొట్టి, వెంటనే కలుపుతూ ఉండాలి. గుడ్లు బాగా గట్టిపడే వరకు, అంటే భుర్జీ తయారయ్యే వరకు కలుపుతూ వండాలి.
- చివరగా ఉప్పు, ఎర్ర కారం (మీ రుచి ప్రకారం) వేసి బాగా కలపాలి.
- దానిపై కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా వడ్డించుకోవాలి.
బీట్‌రూట్ ఉపయోగాలు..
బీట్‌రూట్ అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఒక అద్భుతమైన సహజ సూపర్ ఫుడ్. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఐరన్ సమృద్ధిగా ఉండి రక్తహీనత (Anemia) నివారణకు తోడ్పడుతుంది. పొటాషియం, మాంగనీస్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతే కాకుండా ఇందులో పుష్కలంగా ఉండే ఫోలేట్ (విటమిన్ B9) గర్భిణీ స్త్రీలకు కణాల పెరుగుదలకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. ఇది మెదడు పనితీరును, ఏకాగ్రతను పెంచుతుంది. బీట్‌రూట్‌లో సహజ చక్కెర ఉన్నప్పటికీ, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, కేలరీలు తక్కువ కాబట్టి, మధుమేహ రోగులు కూడా నియంత్రణలో తినవచ్చు.
-
అమ్మకు భరోసా.. మూడు దశాబ్దాల ప్రస్థానంలో భారత్ విజయగాథ -
అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే, సమస్యలన్నీ పరార్..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications