నాన్ వెజ్‌పై నిమ్మకాయ పిండుకుంటున్నారా?... ఇది తెలుసుకోండి!
ఒకప్పుడు ఆదివారం మాత్రమే చికెన్, మటన్ లాంటివి తినేవారు. జొమాటో, స్విగ్గీ లాంటివి వచ్చిన తర్వాత మనకు కావల్సిన నాన్ వెజ్ వంటకాలను ఇంటికే రప్పించుకుంటున్నాం. వారానికి ఐదురోజులు, వారానికి మూడురోజులు తినేవారు కూడా ఉన్నారు. ఇలా తినేవారిలో చాలామంది వాటిపై నిమ్మకాయను పిండుకుంటుంటారు. నిమ్మరసం వల్ల ఆ వంటకాలకు రుచి, వాసన మెరుగుపడటమే కాకుండా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. అయితే అన్ని సందర్భాల్లో నిమ్మరసం వల్ల మంచే జరుగుతుందని చెప్పలేం.
నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు
రుచిని మెరుగుపరుస్తుంది... నిమ్మరసంలోని ఆమ్లత్వం మాంసానికి ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.. నిమ్మరసం జీర్ణవ్యవస్థను ఉత్తేజపరచడంతోపాటు మాంసాన్ని జీర్ణించుకోవడంలో సహాయపడుతుంది. బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది... నిమ్మరసంలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మాంసంలోని కొన్ని రకాల హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడతాయి. విటమిన్ సి అందుతుంది... నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నిమ్మరసం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు
ఎక్కువ మొత్తంలో నిమ్మరసం వాడడం వల్ల ఆహారం అధికంగా పుల్లగా మారి, కడుపులో ఆమ్లత్వం పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి నిమ్మరసం అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. నిమ్మరసంలోని ఆమ్లత్వం దంతాల ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. ఎక్కువ మొత్తంలో నిమ్మరసం వాడకుండా తక్కువ మొత్తంలోనే ఉపయోగించండి. పాత లేదా తాజాగా లేని మాంసంతో నిమ్మరసం వాడకండి. తాజాగా ఉండేవాటిపైనే నిమ్మరసం వాడండి. జీర్ణ సమస్యలు ఉన్నవారు నిమ్మరసాన్ని తక్కువ మొత్తంలోనే వాడాలి లేదంటే వైద్యుల సలహా తీసుకోవాలి. మన శరీరం తీరు, మనకున్న ఆరోగ్య, అనారోగ్య పరిస్థితుల కారణంగా చికెన్, మటన్ తినేటప్పుడు నిమ్మరసం వాడటం అనేది ఆధారపడివుంటుంది.












Click it and Unblock the Notifications