Benefits Of Mint: పుదీనా తినడం లేదా.. అయితే మీరు భారీగా నష్టపోతారు..!
శరీరానికి ఆకు కూరలు ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని ఆకు కూరలు కొందరు సరిగా తినరు. వాటిలో ఒకటి పుదీనా. ఈ పుదీనా శరీరానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎండా కాలంలో పుదీనా నీరు తాగితే శరీరం చల్లగా ఉంటుంది. వేసవిలో పుదీనా నీరు తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. పుదీనా నీరు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. పుదీనా ఆకు నీరులో చక్కెర ఉండదు కాబట్టి డయాబెటిక్ రోగులు ఈ పుదీనా నీరును తాగొచ్చు. పుదీనా నీరు తాగడం వల్ల నోటి దుర్వాసన కూడా పోతోంది. పుదీనాలో కాలరీలు తక్కువగా ఉండడంతో పాటు కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఏ, విటమిన్ సీ, డీబీ కాంప్లెక్స్ విటమిన్లు ఈ ఆకుల్లో సమృద్ధిగా ఉంటాయి.
ఇవి చర్మానికి మంచివని నిపుణులు చెబుతున్నారు. పుదీనాలో ఉండే ఐరన్, పోటాషియం, మాంగనీస్ వంటి వాటి వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి మెదడు పనితీరు కూడా బాగా మెరుగవుతుందట. ముఖ్యంగా పుదీనా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లామెటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయని వివరిస్తున్నారు. చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని ముంచి ఆ డ్రాప్స్ చెవిలో, ముక్కులో ఆరారా వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది. పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గించడంతో పాటు కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు.

పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసుకొని, దీనితో దంతాలుతో తోముకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా వికారం, వాంతులు కూడా తగ్గుతాయి. పుదీన ఆకుల రసం లో కొద్దిగా నిమ్మరసం, తేలేను కలుపుకొని తీసుకోవడం వలన అజీర్ణం, కడుపు ఉబ్బరం, అధికారం వాంతులు వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియం, పాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది వాంతులతో బాధపడేవారు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం, తేనే కలుపుకుని కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పుదీనా ఆకుల్ని ఎండబెట్టి దానిని టీ పొడిలో కలిపి టీ చేసుకుని తాగితే గొంతుకు ఇన్ఫేక్షన్ రాకుండా ఉంటుంది.
-
సండే స్పెషల్ "కడక్‌నాథ్ కోడి మాంసం".. నాటు కోడి కంటే బెస్ట్ టేస్ట్ ? -
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే "వెజిటెబుల్ మజ్జిగ పులుసు" ట్రై చేస్తారా..? -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications