పచ్చికారంతో 'సొరకాయ కర్రీ'.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..!

కొన్ని కూరలు కారం వేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి. మరికొన్ని కూరలు పచ్చికారంతో టేస్టీగా ఉంటాయి. అయితే పచ్చికారంతో 'సొరకాయ కర్రీ' సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. మరి పచ్చికారంతో 'సొరకాయ కర్రీ' ఎలా చేయాలి..? ఈ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి..?

పచ్చికారంతో 'సొరకాయ కర్రీ' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. సొరకాయ ఒకటి పెద్దది, వెల్లుల్లి రెబ్బలు పది, పచ్చిమిర్చి రుచికి తగినన్ని, అల్లం చిన్న ముక్క, నూనె తగినంత, శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ లు, మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు అర టీస్పూన్, ఉప్పు తగినంత, పచ్చికొబ్బరి ముక్కలు కొన్ని, కొత్తిమీర తరుగు తీసుకోవాలి.

పచ్చికారంతో 'సొరకాయ కర్రీ' తయారీ విధానం చూస్తే.. ముందుగా సొరకాయను తీసుకుని పైన చెక్కును తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలను మిక్సీ జారులో వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చిగా గ్రైండింగ్ చేసుకుని పక్కనపెట్టుకోవాలి.

Bottle Gourd Curry with Green Chilies Tastes Super Delicious This Way

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులో నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కరివేపాకు, పచ్చిమిర్చి పేస్టు వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు అందులో సొరకాయ ముక్కలు, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో మిక్సీ పట్టుకున్న పచ్చికొబ్బరి తురుమును వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు వేస్తే సరి ఘుమఘుమలాడే సొరకాయ కర్రీ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+