బీపీ టాబ్లెట్స్ వేసుకున్నా బీపీ తగట్లేదా? ఇలా చెయ్యండి!

ప్రస్తుత సమాజంలో ఇంటికి ఒకరైనా బీపీతో బాధపడుతున్నారు. హైబీపీ బారినపడి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు బీపీ టాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి చాలా ఇళ్ళల్లో కనిపిస్తుంది. అయితే చాలామందికి బీపీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా బీపీ తగ్గడం లేదని చెబుతూ ఉంటారు. అటువంటివారు బీపీని నేచురల్ గా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బీపీ ని కంట్రోల్ చేసుకోవడం కోసం చేయవలసింది ఏమిటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

బీపీ కంట్రోల్ కావాలంటే ఇలా చెయ్యండి
బిపి ని కంట్రోల్ చేసుకోవడం కోసం ముందు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో ఉప్పును తగ్గించాలి. అధిక ఉప్పు, కారం వినియోగం వల్ల బీపీ కంట్రోల్ కాదు. ఇక బిపి కంట్రోల్ చేయడం కోసం ప్రతిరోజూ తప్పనిసరిగా శారీరక వ్యాయామం చేయాలి.

BP is not controlling even after taking BP tablets Do this

ఇవి కంట్రోల్ చేస్తే బీపీ కంట్రోల్ అవుతుంది
రోజు కనీసం ఒక అరగంట పాటైనా యోగా, ధ్యానం వంటివి చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. వీటివల్ల కూడా సహజంగా బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ధూమపానం, మద్యపానం వంటివి మానేయాలి. ధూమపానం, మద్యపానంతో బిపి మరింత పెరుగుతుంది. కనుక వీటిని మానేయడం మంచిది. విపరీతంగా బరువు పెరిగిన వారిలోనూ బీపి కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. కనుక బరువు తగ్గడంపైన దృష్టి సారించాలి.

టెన్షన్స్ తగ్గించుకోండి
అంతేకాదు ఆందోళన, ఒత్తిడి వంటివి బీపీని బాగా పెంచుతాయి. టెన్షన్స్ ఎక్కువగా ఉంటే హైపర్ టెన్షన్ పెరుగుతుంది. కనుక వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. సరిగ్గా నిద్రపోని వారిలో కూడా బీపీ బాగా పెరుగుతుంది. కనుక ప్రతిరోజు కచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి.

బీపీని నిర్లక్ష్యం చెయ్యొద్దు
ఇక ఈ నియమాలన్నీ పాటించినప్పటికీ బీపీ తగ్గకపోతే మరోమారు వైద్యుని వద్దకు వెళ్లి సలహా తీసుకొని మందులు వాడాలి. బీపీని ఏం కాదులే అని నిర్లక్ష్యం చెయ్యకూడదు. నిర్లక్ష్యం చేస్తే అది పక్షవాతానికి, శరీరంలోని ముఖ్య అవయవాల డ్యామేజ్ కు దారి తీయవచ్చు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+