క్యాబేజీ బఠాణీ కర్రీ.. ఇలా చేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవెల్..!

చాలా మంది క్యాబేజీ కర్రీని తినేందుకు ఇష్టపడరు. ఇక పిల్లలు అయితే క్యాబేజీ అనగానే నో అని చెబుతుంటారు. అయితే క్యాబేజీ కర్రీని సరైన పద్దతిలో చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక క్యాబేజీ బఠాణీ కర్రీ అయితే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ అన్నంతో పాటు చపాతీ, రోటీ దేనిలోకి తిన్నా మంచి రుచికరంగా ఉంటుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వంటివి వేయకుండానే రుచి వస్తుంది. మరి ఈ సూపర్ రెసిపీని ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?

క్యాబేజీ బఠాణీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. క్యాబేజీ ఒకటి, పచ్చి బఠాణీలు కొన్ని, నూనె తగినంత, సోంపు ఒకటీస్పూన్, పసుపు చిటికెడు, టమాటాలు రెండు లేదా మూడు, ధనియాల పొడి అరటీస్పూన్, జీలక్రర పొడి అరటీస్పూన్, మిరియాల పొడి అరటీస్పూన్, కారం తగినంత, గరంమసాలా చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి.


క్యాబేజీ బఠాణీ కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా తాజా క్యాబేజీని సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు క్యాబేజీ తురుముని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కర్రీలోకి టమాటా ప్యూరీని తయారు చేసుకోవాలి. అందుకోసం మిక్సీ జార్ లో టమాటా ముక్కలు వేసుకొని మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సోంపు, పసుపు, టమాటా ప్యూరీ, పచ్చిబఠాణీలు, కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి కాసేపు మగ్గించుకోవాలి.

cabbage Pea Curry Simple and Tasty home made taste Quick 20-Minute Recipe for Everyday Meals

ఇప్పుడు ఆ మిశ్రమంలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరంమసాలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అవన్నీ కలిసేలా కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీ తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. క్యాబేజీ రంగు మారే వరకూ మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ క్యాబేజీ బఠాణీ కర్రీ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+