Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్యాబేజీ రోటి పచ్చడి.. ఇలా చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..

క్యాబేజీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే క్యాబేజీలో పీచు అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే క్యాబేజీలో విటమిన్ సీ, విటమిన్ కే ఉంటాయి. ఈ పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాక గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు వివరిస్తున్నారు. ఇక క్యాబేజీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. అయితే క్యాబేజీని కర్రీ, ఫ్రై మాదిరిగా కాకుండా ఇలా రోటీ పచ్చడి చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.

మరి టేస్టీ క్యాబేజీ రోటీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? క్యాబేజీ రోటీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. క్యాబేజీ పావు కిలో, పల్లీలు రెండు స్పూన్ లు, నూనె తగినంత, పచ్చిమిర్చి తగినన్ని, టమాటాలు మూడు, శనగపప్పు ఒక స్పూన్, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు ఐదు, ధనియాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు సరిపడా, పూదీనా, కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి.

క్యాబేజీ రోటీ పచ్చడి తయారీ విధానంలో ముందుగా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటోలను కాస్త పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై గిన్నె పెట్టుకుని నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో పచ్చి శనగపప్పు వేసి తక్కువ మంటమీద వేయించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలోనే ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి.

ఇక అదే గిన్నెలో తగినంత నూనె పోసుకుని వేడి చేయాలి. అందులో క్యాబేజీ తరుగు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తక్కువ మంటపై మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్నాక చివర్లో పూదీనా, కొత్తిమీర అలాగే చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టుకోవాలి.

Cabbage Roti Chutney Magic Easy Step-by-Step Guide to Crispy Healthy Flatbreads with Tangy Dip

ఆ తర్వాత మిక్సీ జార్ లో పల్లీలు వేసి మొత్తని పొడిలా గ్రైండింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీ, టమాటో మిశ్రమాన్ని మరీ మెత్తగా కాకుండా గ్రైండింగ్ చేయాలి. ఇప్పుడు ఆ క్యాబేజీ పచ్చడిని తాలింపు పెట్టుకుంటే సరి.. ఘుమఘుమలాడే క్యాబేజీ పచ్చడి రెడీ అయినట్టే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+