రోజూ వ్యాయామం చేయలేకపోతున్నారా? అయితే ఇలా ట్రై చెయ్యండి!

ప్రతిరోజు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలామంది వ్యాయామం చేయాలని భావించినప్పటికీ శరీరం సహకరించడం లేదని, లేదా కుదరడం లేదని రకరకాల సాకులతో వ్యాయామం చేయకుండా బద్దకిస్తారు. అలా రోజు వ్యాయామం చేయలేకపోతున్న వారు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఏ విధంగా వారు వారి జీవన విధానాన్ని మార్చుకోవాలి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వ్యాయామం ఇలా మొదలు పెట్టాలి
రోజు వ్యాయామం చేయడం ప్రారంభించిన మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంతమంది మొదట్లో చాలా ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల, తర్వాత రోజుల్లో దానిని కంటిన్యూ చేయలేరు. కనుక ఎవరైనా వ్యాయామం ప్రారంభించాలి అనుకుంటే కొద్దికొద్దిగా దానిని పెంచుకుంటూ పోవాలి కాని, మొదట్లోనే ఎక్కువ చేయకూడదు. శరీరం అలవాటు పడటానికి వ్యాయామాన్ని చిన్నగా ప్రారంభించాలి.

Can t exercise every day Try this for better result

వ్యాయామం చెయ్యలేకుంటే వీటిని కూడా చెయ్యొచ్చు
మొదట్లో 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు నడకతో ప్రారంభించి నెమ్మదిగా సమయాన్ని పెంచుకోవాలి. ఇక చాలామంది వ్యాయామం చేయాలంటే అదో పెద్ద పని లాగా బద్ధకిస్తూ ఉంటారు. అటువంటి వారు మీకు ఇష్టమైన శారీరక శ్రమ కలిగే పనిని చెయ్యవచ్చు. డాన్స్ ఇష్టం ఉన్నవాళ్లు ఓ గంట పాటు ప్రతిరోజు డాన్స్ చేయవచ్చు. సైక్లింగ్, స్విమ్మింగ్ చేయడం ఇష్టం ఉంటే సైక్లింగ్, స్విమ్మింగ్ కూడా వ్యాయామం కిందికే వస్తాయి.

వారమంతా కుదరకుంటే వారాంతంలో
కనుక మీకు ఇష్టమైన వాటిని ఎంచుకొని వాటితోటి కూడా వ్యాయామం చేయవచ్చు. ఇక ప్రతిరోజు వ్యాయామం చేయడానికి కుదరని వాళ్ళు వారాంతాల్లో సమయం కేటాయించి వ్యాయామం చేయవచ్చు. కచ్చితంగా ప్రతి వారాంతం వ్యాయామం చేయడాన్ని పనిగా పెట్టుకుని కష్టపడితే మంచి రిజల్ట్ ఉంటుంది.

కష్టంగా భావించకుండా, ఇష్టంతో చేస్తే గుడ్ రిజల్ట్స్
ప్రస్తుత సమాజంలో, మారిపోయిన జీవనశైలితో మనం అనేక రోగాల బారిన పడుతున్నాం. అందుకే రోగాలు మన దరి చేరకుండా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసం కచ్చితంగా వ్యాయామం చేయాలి. అయితే ఆ వ్యాయామాన్ని కష్టంగా భావించకుండా, ఇష్టంతో చేస్తే అది మనకు అలవాటుగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+