క్యాప్సికం పచ్చడి.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..!
క్యాప్సికంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. క్యాప్సికం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. క్యాప్సికంలో విటమిన్ సీతోపాటుగా పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే క్యాప్సికం ను సాధారణంగా టమాటో వేసి కర్రీగా చేసుకుంటారు. కానీ క్యాప్సికం పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా..? సూపర్ టేస్టీగా ఉండే క్యాప్సికం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
క్యాప్సికం పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూస్తే.. క్యాప్సికం రెండు మీడియం సైజు, వెల్లుల్లి రెబ్బలు ఐదు, ఎండుమిర్చి ఎనిమిది, చింతపండు నిమ్మకాయ సైజులో, పసుపు చిటికెడు, నూనె రెండు టేబుల్ స్పూన్ లు, ఉప్పు రుచికి సరిపడా, తాలింపు గింజలు ఒక స్పూన్ తీసుకోవాలి.
సూపర్ టేస్టీ క్యాప్సికం పచ్చడి తయారీ విధానంలో ముందుగా క్యాప్సికం ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో క్యాప్సికం ముక్కలు వేసి వేయించుకోవాలి. క్యాప్సికం ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకుని కాస్త చల్లారబెట్టుకోవాలి.

ఇప్పుడు ఓ మిక్సీ గిన్నె తీసుకుని అందులో వేయించిన ఎండుమిర్చి, క్యాప్సికం ముక్కలు, వెల్లుల్లి, చింతపండు, పసుపు, ఉప్పు కలుపుకోవాలి. ఆ తర్వాత మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు కోసం స్టవ్ పై గిన్నె పెట్టుకోవాలి. నూనె వేసి అందులో పోపు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాళింపులో పచ్చడి వేసి బాగా కలిసేలా మిక్సింగ్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ క్యాప్సికం పచ్చడి రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications