యాలకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
యాలకులు జింగీబెరాసెయ్ మొక్కల నుంచి లభిస్తాయి. మనదేశంతోపాటు నేపాల, భూటాన్, ఇండోనేషియాలో కూడా పండిస్తుంటారు. సుగంధ ద్రవ్యాల్లో మహారాణిగా యాలకులను పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో మూడోస్థానంలో నిలుస్తాయి. మొదటి రెండు స్థానాల్లో కుంకుమపువ్వు, వెనీలా ఉన్నాయి.
వీటిల్లో ప్రధానంగా గ్రీన్, బ్లాక్ అనే రెండు రకాలుంటాయి. మనం ఎక్కువగా ఉపయోగించేది గ్రీన్ యాలకులు. మనదేశంతోపాటు మలేషియాలో ఎక్కువగా పండుతాయి. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడమే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా అడ్డుకుంటాయి. డిప్రెషన్ నుంచి బయట పడాలంటే యాలకుల టీకానీ, పాలుకానీ తాగితే సరిపోతుంది.

సంతాన సాఫల్యతను పెంచుతాయి. వీటిలో సినియోల్ అనే కాంపౌండ్ పురుషుల్లో నరాల పటిష్టతకు ఉపయోగపడుతుంది. ప్రతి రోజు చిటికెడు యాలకుల పొడి వాడినా సంతానం కలుగుతుంది. నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్థ్యం లేనివారు ప్రతిరోజు యాలకులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. కడుపులో మంట, నొప్పి వంటివి ఉంటే ఇవి పోగొడతాయి. నెగెటివ్ ఆలోచనల నుంచి మనల్ని యాలకులు కాపాడతాయి.

ప్రతిరోజు యాలకుల టీ తాగితే మంచి ఫలితాలుంటాయి. కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలకుల్ని వాడాలి. కఫాన్ని తగ్గిస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ ను కూడా నయం చేస్తాయి. యాలకుల్లో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ నుంచి కాపాడుతుంది. ఈ దిశగా ఇంకా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. బ్లడ్ ప్రెజర్ ను ఎక్కువ, తక్కువ కాకుండా యాలకులు చూస్తాయి. క్యాన్సర్ వస్తే అది త్వరగా పెరగకుండా కాపాడతాయి. ఉద్రిక్తతలను కూడా తగ్గిస్తాయి. ఒత్తిడిలో ఉన్నవారు టీకానీ, పాలల్లోకానీ యాలకుల పొడి వేసుకొని తాగితే చాలా మంచిది.












Click it and Unblock the Notifications