క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..!

దొండకాయ కర్రీ అంటే సాధారణంగా చాలామంది ఇష్టపడరు. కానీ చేయాల్సిన విధానంలో చేస్తేమాత్రం ముద్ద మిగుల్చకుండా లాగించేస్తారు. దొండకాయలతో కూర, పచ్చడి చేస్తారు. అయితే ఎప్పుడూ లేని విధంగా క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై ఇలా చేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా అంటారు. మరి సూపర్ టేస్టీ క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి.

టేస్టీ క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూస్తే.. దొండకాయలు అర కేజీ, నూనె మూడు స్పూన్ లు, ఎండుమిర్చి ఐదు, పచ్చిమిర్చి రెండు, ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లి రెబ్బలు పది, పచ్చి కొబ్బరి ముక్కలు అర కప్పు, జీడిపప్పు గుప్పెడు, ఉప్పు రుచికి సరిపడా, ఆవాలు, జీలకర్ర అర టీ స్పూన్, మినపప్పు ఒక టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి.

దొండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలంటే.. ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి పొడుగ్గా చివర్లు కట్ చేసుకోవాలి. వాటితోపాటుగా ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేయాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె పోయాలి. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండు మిర్చి, కట్ చేసిన పచ్చి మిర్చి వేసుకుని మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేంతవరకూ దోరగా ఫ్రై చేయాలి.

Catering Style Ivy Gourd Fry Crispy Crunchy amp amp Next-Level Delicious

ఆ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, దొండ కాయ ముక్కలు వేసి బాగా కలపాలి. అలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఓ మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు దొండకాయలు మగ్గిన తర్వాత అందులో కాస్త ఉప్పు, పసుపు వేసి కరివేపాకు రెమ్మలు వేసి మరికొంతసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో కొబ్బరి పొడి, వేయించిన జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీర జల్లుకుంటే సరి.. టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+