వాష్ రూమ్ లో మొబైల్ ఫోన్ వాడుతున్నారా..?
మొబైల్ ఫోన్ లేకుండా క్షణమైనా ఉండలేని కాలంలో ప్రస్తుతం యువత ఉన్నారు. ఉదయం లేచింది మొదలు.. అర్ధరాత్రి పోయే వరకూ చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. మొబైల్ లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా కొందరు భావిస్తుంటారు. చివరికి వాష్ రూమ్ లోకి కూడా మొబైల్ ఫోన్ తీసుకెళ్తుంటారు. అయితే ఇలా చేయడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మొబైల్ ఫోన్ లేకుండా యూత్ క్షణమైనా గడిపే పరిస్థితి లేకుండా పోయింది. చాలా మందికి ఫోన్ ఒక వ్యసనంగా మారింది. సోషల్ మీడియా ప్రభావం పెరిగాక ఎక్కడికి వెళ్లినా ఫోన్ చేతిలో ఉండాల్సిందే అన్నట్లుగా పరిస్థితి మారింది. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు అందరూ ఫోన్ కు ఎడిక్ట్ అవుతున్నారు. చివరికి మొబైల్ ను టాయిలెట్ లోకి తీసుకెళ్లడం కూడా చాలా మంది చేస్తుంటారు. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.
వాష్ రూమ్ లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా, జెర్మ్స్ వంటివి ఉంటాయి. అలాగే అక్కడ ఉన్న సాల్మోనెల్లా, ఇ-కొలి వంటి బ్యాక్టీరియాలు ఫోన్ మీదకు చేరి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ కు అతుక్కుపోయిన ఆ బ్యాక్టీరియా కారణంగా కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(యూటీఐ) వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

అలాగే ఫోన్ పైన చేరిన బ్యాక్టీరియా చేతులకు అంటుకొని అది కడుపులోకి చేరడం కారణంగా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వాష్ రూమ్ లో ఎక్కువసేపు ఫోన్ వినియోగించడం కారణంగా విసర్జన అవయవాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది పైల్స్, ఫిషర్స్ వచ్చే అవకాశాలను పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications