చికెన్‌లో తినకూడని భాగాలు ఇవే.. తస్మాత్ జాగ్రత్త !!
చికెన్.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో ఎన్నో రకాలు ఉన్నా కానీ.. కొత్తగా మళ్లీ పూటకో రకం పుట్టుకొస్తూనే ఉంటాయి. అంతే కాకుండా చికెన్ అనేది మంచి ప్రొటీన్ ఫుడ్‌గా గుర్తింపు పొందింది. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చికెన్‌లోని అన్ని భాగాలు ఆరోగ్యానికి సమానంగా మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తినకూడని చికెన్ భాగాలు..
నిపుణుల సూచనల ప్రకారం చికెన్‌లో సరైన భాగాలను ఎంపిక చేసుకుని, శుభ్రంగా వండి తినడం చాలా అవసరం. అలాగే కొన్ని భాగాలను వీలైనంత వరకు దూరంగా ఉంచడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా స్కిన్‌లో అధిక కొవ్వు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి హానికరం. అలాగే మెడ, తల, లంగ్స్, గిజార్డ్ (కందనకాయ), కాళ్లు, తోక వంటి భాగాలు బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే ప్రాంతాలుగా పరిగణిస్తారు. ఇవి సరిగ్గా శుభ్రం చేయకపోతే ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా ఈ భాగాలను తరచుగా తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా తక్కువగా వండిన లేదా సరిగ్గా శుభ్రం చేయని మాంసం వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
తినడానికి మంచిగా భావించే భాగాలు..
చికెన్‌లో బ్రెస్ట్ పీస్, లెగ్ పీస్, వింగ్స్ వంటి భాగాలు ఆరోగ్యానికి మంచివిగా భావిస్తారు. ఇవి ప్రోటీన్ ఎక్కువగా కలిగి ఉండటంతో పాటు తక్కువ కొవ్వుతో ఉంటాయి. ముఖ్యంగా బ్రెస్ట్ పీస్ ఫిట్‌నెస్ ఫాలో అయ్యే వారికి చాలా మంచిదిగా పరిగణించబడుతుంది.
వంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చికెన్ వండేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మాంసాన్ని పూర్తిగా శుభ్రం చేయడం, సరైన ఉష్ణోగ్రతలో బాగా వండటం చాలా అవసరం. అర్ధవండిన చికెన్ తినడం ప్రమాదకరం. అలాగే వాడే కత్తులు, పాత్రలు కూడా శుభ్రంగా ఉండాలి. క్రాస్ కంటామినేషన్ నివారించేందుకు వేరే పదార్థాలతో కలపకుండా జాగ్రత్త పడాలి.
మరోవైపు ఫ్రెష్ చికెన్‌ను మాత్రమే ఉపయోగించడం మంచిది. ఎక్కువసేపు బయట ఉంచిన లేదా సరిగా ఫ్రిజ్‌లో నిల్వ చేయని చికెన్ ఆరోగ్యానికి హానికరం. ఫ్రీజ్‌లో నిల్వ చేసిన చికెన్‌ను సరైన విధంగా డిఫ్రాస్ట్ చేసి వండాలి. మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం కూడా మంచిది కాదు.












Click it and Unblock the Notifications