చికెన్ లెగ్ పీస్ తింటున్నారా?.. ఇది తెలుసుకోండి!
ప్రతిరోజు మాంసాహారం లేనిదే ఎవరికీ ముద్ద దిగడంలేదు. అంతగా అలవాటుపడిపోయారు. అటవాటు పడ్డారు అనేదానికన్నా ప్రజల్ని అలవాటుపడేలా చేశారు అని చెప్పొచ్చు. బిర్యానీ పాయింట్లు, రెస్టారెంట్లు, హోటల్స్, దాబాలు... ఇలా అందరూ పోటీలుపడి బిర్యానీలమీద రాయితీలివ్వడం, తక్కువ ధరకు అమ్మడం, రెస్టారెంట్ కానీ, హోటల్ కానీ ప్రారంభం జరుపుకునేరోజు అతి తక్కువ ధరకు అమ్మడం.. ఇలా అనేక కారణాలవల్ల ప్రజలంతా మాంసాహారానికి బాగా అలవాటుపడిపోయారు. దీనికితోడు జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీలను ఇంటికే తీసుకువచ్చి ఇస్తుండటంతో నాన్ వెజ్ లేనిదే ఎవరికీ ముద్ద దిగని పరిస్థితి ఏర్పడింది. మాంసాహారం తినేవారు చికెన్, మటన్ లెగ్ పీస్‌లు రెండూ మహా ఇష్టంగా తింటారు. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
చికెన్ లెగ్ పీస్ ఉపయోగాలు
ప్రోటీన్... చికెన్ లెగ్ పీస్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణం, మరమ్మత్తుకు సహాయపడుతుంది. ఖనిజాలు... ఇందులో ఐరన్, జింక్, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి అవసరం. విటమిన్లు... చికెన్ లెగ్ పీస్‌లో విటమిన్ బి12 వంటి విటమిన్లు కూడా ఉంటాయి.

చికెన్ లెగ్ పీస్ నష్టాలు
కొవ్వు... చికెన్ లెగ్ పీస్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంతోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ కేలరీలు వీటిల్లో ఉంటాయి. దీనివల్ల చాలా తొందరగా బరువు పెరుగుతారు.
మటన్ లెగ్ పీస్ ఉపయోగాలు
ప్రోటీన్... మటన్ లెగ్ పీస్‌లో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఖనిజాలు... ఇందులో ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి.
మటన్ లెగ్ పీస్ నష్టాలు
కొవ్వు... మటన్ లెగ్ పీస్‌లో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇందులో కూడా ఎక్కువ కేలరీల ఉంటాయి. చికెన్, మటన్ లెగ్ పీస్‌లను మితంగా తినడం మంచిది. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండే వంట పదార్థాలనే తినడానికి ఎంచుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని పాటించడం వల్ల ఇతరులకు కూడా మీరు స్ఫూర్తిగా నిలుస్తారు.












Click it and Unblock the Notifications