చికెన్ పాయ, మటన్ పాయ తింటున్నారా?.. ఇది తెలుసుకోండి!

ఈరోజుల్లో చికెన్ కానీ, మటన్ కానీ లేకుండా ఎవరికీ ముద్ద దిగడంలేదు. ప్రతిరోజు తినేవారు కూడా రోజురోజుకు ఎక్కువవుతున్నారు. అంతగా మాంసాహారానికి అలవాటుపడుతున్నారు. అయితే ఏదైనా ఎంత మితంగా తీసుకోవాలో అంతే మితంగా తినాలి. అప్పుడే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. చాలామంది చికెన్ పాయ, మటన్ పాయను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కోడి కాళ్ల భాగాలే చికెన్ పాయ, మేక కాళ్ల భాగలే మటన్ పాయ. దీంతో సూప్స్ చేసుకుంటారు. మరికొందరు కూరలు చేసుకుంటారు. పాయ ఎంతో రుచికరంగా ఉండటమేకాదు.. శరీరానికి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

అధిక ప్రొటీన్లు వీటి సొంతం
చికెన్, మటన్ రెండూ అధిక ప్రోటీన్ మూలాలు. ప్రోటీన్ శరీరానికి అవసరమైన కణాల నిర్మాణానికి, కండరాల పెరుగుదలకు, శరీర కణజాలాల మరమ్మతుకు సహాయపడుతుంది. ఈ భాగాల్లో కొల్లాజెన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. కొల్లాజెన్ చర్మం, ఎముకలు, కీళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంతోపాటు చర్మాన్ని మెరిసేలా ఉంచడానికి సహాయపడుతుంది. చికెన్, మటన్ పాయ సూప్ జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

chicken paya soup and mutton paya soup health benefits and uses

జలుబు, దగ్గు వెంటనే తగ్గిపోతుంది
శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి చికెన్, మటన్ పాయ సూప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ భాగాలలో విటమిన్లు, ఖనిజాలు వంటి ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. చికెన్, మటన్ పాయలలో కొవ్వు శాతం కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని తక్కువ మొత్తంలో తీసుకోవాలి. గౌట్, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా తీసుకుని మాత్రమే వీటిని తీసుకోవాలి. చికెన్, మటన్ పాయలు రుచికరమైనవి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. అయితే వీటిని మితంగా తీసుకోవడం మంచిది. సాధ్యమైనంతవరకు మాంసాహారాన్ని చాలా తక్కువగా తీసుకోవాలని, అందుకు బదులుగా వాటిల్లో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు ఏయే పదార్థాల్లో దొరుకుతాయో ఆ శాకాహారం తీసుకుంటే చాలామంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+