ఈ గింజలు తింటే ఒక్క వెంట్రుక కూడా రాలదు!!
ఈరోజుల్లో అందరికీ జుట్టు రాలిపోతుంటుంది. ఏం చేసినా, ఎంత ఖరీదైనా నూనెలు వాడినా ఉపయోగం ఉండటంలేదని వాపోతుంటారు. ఒత్తిడి లేకుండా సంతోషంతో జీవిస్తే జట్టు రాలదనే విషయం తెలిసిందే. అందుకు మంచి ఆహారం తీసుకోవాలి. జుట్టుకోసం ఎంతోమంది ఎన్నోరకాలుగా ప్రయత్నాలు చేసివుంటారుకానీ వీటిని తిని ఉండరు. ఈ గింజలను నాలుగు వారాలు తినడంవల్ల జుట్టుకు అదిరిపోయే రిజల్ట్ ఉంటుందని సైంటిఫిక్ గా ప్రూవైంది.
జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించే విత్తనం ఒకటి ఉంది.. అదే చిరోంజి. ఇది జుట్టుకు ఎంతో దోహదపడుతుంది. దీన్ని వాడటంవల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది. చిరోంజీని తీపి వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. కానీ అది కూడా గుణాలతో నిండి ఉంటుంది. నిపుణుల సలహా మేరకు దీన్ని తీసుకుంటే ఏ విధంగా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది.

చిరోంజి ప్రయోజనాలు
ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
మంచి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలి.
జుట్టును బలోపేతం చేయడానికి, విరిగిపోకుండా నిరోధించడానికి మంచిది.
వీటిని తినడంవల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది.
జుట్టు మూలాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
చిరోంజి నూనెను రాసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది.
చిరోంజి మాస్క్ జుట్టు కండిషనింగ్‌కు మంచిది.
చిరోంజి జుట్టుతోపాటు జీర్ణవ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచి బలాన్నిస్తుంది.

ఎలా తినాలంటే..
2 స్పూన్ చిరోంజి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత తినాలి. 4 వారాల పాటు ప్రతిరోజు తినడంవల్ల జుట్టు రాలే సమస్య నుంచి మీరు విముక్తులవుతారు. బయట సూపర్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. లేదంటే ఆన్‌లైన్ మార్కెట్‌లో కూడా ఉన్నాయి.. ధర కూడా ఎక్కువేం కాదు.. చాలా తక్కువ. రూ.200 నుంచి ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసినవారు ఒకసారి వీటిని వాడి చూడండి.. ఫలితం మీకే తెలుస్తుంది












Click it and Unblock the Notifications