డబుల్ ధమాకా.. 'కోడిగుడ్డు చికెన్ కూర'.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..
చికెన్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చికెన్ ను ఎలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. ఇక పిల్లలు, బ్యాచిలర్స్ అయితే చికెన్ ను ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడూ ఒకే రకంగా చికెన్ కర్రీ చేసుకుని బోర్ కొట్టిందా..? ఈసారి కొత్తగా చికెన్ కర్రీ చేయాలని ఉందా..? అయితే కోడిగుడ్డు చికెన్ కర్రీ తప్పకుండా ట్రై చేయాల్సిందే. సాధారణంగా మనం చికెన్, గుడ్డును సెపరేట్ గా తింటుంటాం.. కానీ ఈ రెండూ కలిపి చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీ అన్నంతో పాటు చపాతీ, రోటీలోకి టేస్టీగా ఉంటుంది. మరి కోడిగుడ్డు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి..
కోడిగుడ్డు చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా.. ఒక గిన్నెలో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి. ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో గసగసాలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటిని మిక్సీలో చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో గిన్నెలో పెరుగు, మసాలా, ఉప్పు, కారం, పసుపు, వేసుకోవాలి. అందులోనే చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అరగంట పాటు మేరినేట్ చేసుకోవాలి.

ఈ లోపు మరో గిన్నెలో నూనె పోసి.. నూనె వేడెక్కాక అందులో ఉడికించిన గుడ్లను వేసి అన్నివైపులా ఫ్రై చేసుకోవాలి. అవి పక్కన పెట్టుకున్నాక.. అదే నూనెలో తగినన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కలర్ మారేవరకూ వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించుకోవాలి. ఆ మిశ్రమంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ను వేయాలి. కొంచెం నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అదే మిశ్రమంలో మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను వేయాలి. ఆ తర్వాత అందులో ఉడికించిన గుడ్లను కూడా వేయాలి. అలా కొద్దిసేపు ఉడికించాక.. చివరగా అందులో కొత్తిమీర వేసి దించుకోవాలి. కోడిగుడ్డు చికెన్ కర్రీ రెడీ అయినట్లే..












Click it and Unblock the Notifications