వంటనూనె మీరు రోజుకు ఎంత వాడుతున్నారు?
మన వంటకాల్లో నూనెను ఎక్కువగా వాడుతుంటారు. కొందరైతే పదార్థాలు ఉడికిన తర్వాత కూడా వాటిపై నూనె పోస్తుంటారు. అదనంగా వనస్పతి వాడతారు. అయితే నూనె ఎక్కువగా ఉపయోగించడం ఎంతమాత్రం మంచిది కాదు. దీనివల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక నూనె వినియోగం అధిక రక్తపోటు, గుండెజబ్బులకు దారితీస్తుంది.
కొవ్వులో కరిగే ఏ, డీ, ఈ, కే వంటి విటమిన్లను శరీరం గ్రహించుకోవటానికి నూనె అవసరం. శారీరక శ్రమకు అవసరమైన శక్తిని అందిస్తుంది. గానుగ నూనెల గురించి అందరికీ తెలుసు. అలాగే నూనె గింజలను ఒత్తిడికి గురిచేసి తీసే (కోల్డ్ ప్రెస్డ్) వీటికి ఎటువంటి కెమికల్స్ కలపరు. వేడి కూడా చేయరు. సహజంగా ఉండే రుచి అలాగే ఉంటుంది. నూనె గింజలను వేడి చేసి, తయారుచేసేవాటిని రిఫైన్డ్ నూనెలు అంటారు.

స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపించటానికి, ఎక్కువరోజులు నిల్వ ఉండటానికి వీటికి కెమికల్స్ కలుపుతారు. దీనివల్ల ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. ప్రమాదకర రసాయనాలు తొలగిపోతాయి. ఒక్కో నూనెలో ఒక్కో మేలుచేసే పదార్థాలుంటాయి. అన్నింటినీ కలిపి వాడటం చాలా మంచిది. గింజలను ఒత్తిడికి గురిచేసి తీసే నూనెకు నువ్వులు, వేరుశనగ, తవుడు, ఆవ నూనె వంటివి కలిపి వాడొచ్చు. ఆలివ్ నూనె ఆరోగ్యకరమైందేకానీ ధర చాలా ఎక్కువ.
ప్రతి మనిషి రోజుకు 3-5 స్పూన్ల కన్నా ఎక్కువ నూనె తీసుకోకూడదు. నెలకు అరలీటరు నూనె సరిపోతుంది. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నట్టయితే నెలకు 2 లీటర్ల కన్నా ఎక్కువ వాడకూడదు. ఎంత ఉష్ణోగ్రత వద్ద నూనె పొగ వెలువరించే స్థాయికి చేరుకుంటోంది? రుచి, పోషకాల మోతాదులేంటి? అనే వాటిని అంచనా వేసుకొని వాడే నూనెను ఎంపిక చేసుకోవాలి.












Click it and Unblock the Notifications