Dandruff: చుండ్రు సమస్య వేధిస్తుందా.. అయితే ఈ పని చేయండి చాలు..!

చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారు పలు చిట్కాల వల్ల ఉపశమనం పొందుతారు

చాలా మంది చుండ్రుతో బాధపడుతుంటారు. ఈ సమస్య వల్ల జుట్టు కూడా రాలుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చుండ్రును అదుపులో ఉంచుకోవచ్చు. జుట్టు సమస్యలకు తగ్గించడానికి మెంతికూర ఉపయోగపడుతుంది. ఒక కప్పు మెంతి ఆకులను తీసుకొని మిక్సీలో వేసి మెత్తని రుబ్బాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. జుట్టు మొత్తం ఈ మిశ్రమాన్ని రాసిన తర్వాత ఒక అరగంట పాటు బాగా ఆరెదాకు ఉండాలి. తక్కువ రసాయనాలు ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.

పెరుగు

పెరుగు

జుట్టుకు పెరుగును అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. పెరుగు వెంట్రుకల రూట్స్‌ నుంచి చుండ్రును తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పుల్లని పెరుగును మాత్రమే వినియోగించాల్సి ఉంటుందట. అయితే అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు జుట్టుకు ఉంచి శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మార్కెట్లో వివిధ రకాల షాంపులు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని రకాల షాంపులను ఉపయోగించడం వల్ల చుండ్రు తొలగిపోకుండా ఇతర సమస్యలు కూడా వస్తాయి.

థైరాయిడ్

థైరాయిడ్

రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను ఉపయోగిస్తే అది తలపై చెడు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అందుక తేలికపాటి, హెర్బల్ షాంపూని ఉపయోగించడం మంచిది. శీతాకాలంలో చాలా మంది వేడినీటి స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల తలలోని తేమ మొత్తం ఆరిపోతుంది. దీంతో చుండ్రు సమస్యను పెరుగుతోంది. ఇది కాకుండా తలపై స్కార్ఫ్‌లు, క్యాప్‌లు ధరించడం వల్ల తగినంత గాలి అందక చుండ్రు పెరుగుతుంది. జుట్టులో చుండ్రు సమస్యకు థైరాయిడ్‌ కూడా కారణమట. దీనివల్ల స్కాల్ప్ డ్రైగా మారి జుట్టు విరగడం, రాలడం మొదలవుతుంది.

నిమ్మకాయ

నిమ్మకాయ

జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి పెరుగుతో పాటు నిమ్మకాయ రసాన్ని కలిపి జుట్టుకు వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అయితే నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలను తొలగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+