రాత్రిపూట స్వెటర్ వేసుకొని పడుకుంటున్నారా? ఇది తెలుసుకోండి!

శీతాకాలం కావడంతో రాత్రివేళ వెచ్చగా ఉండేందుకు అందరూ స్వెటర్లు ధరించి నిద్రపోతుండటంతోపాటు మరికొందరు కాళ్లకు సాక్సులు వేసుకుంటుంటారు. చలి నుంచి రక్షించుకోవడానికి, వెచ్చదనం నుంచి తప్పించుకొని హాయిగా నిద్రపోవడానికి అందరూ ఇలాగే చేస్తుంటారు. అయితే ఈ పద్ధతి అనారోగ్యానికి దారితీస్తుందని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్రలేమి తీవ్రమవుతుంది
రాత్రివేళ స్వెటర్ వేసుకొని పడుకుంటే శరీరం అధికంగా వేడెక్కుతుంది. దీని వల్ల నిద్రలో ఇబ్బందులు, చెమటలు పట్టడం, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే
రక్త ప్రసరణ సమస్యలు కూడా వస్తాయి. బిగుతుగా ఉన్న స్వెటర్ వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక, చేతులు, కాళ్ళలో తిమ్మిరి వచ్చే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఊపిరితిత్తులకు తగినంత గాలి అందక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. స్వెటర్ వల్ల చర్మం ఊపిరి పీల్చుకోవడం కష్టమవడంతోపాటు దురద, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వల్ల నిద్రలో గడబిడ, నిద్రలేమి తలెత్తే అవకాశం ఉంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం, రాత్రిపూట స్వెటర్ వేసుకుని పడుకోవడం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తేలింది.

dangers of sleeping in a sweater at night

శారీరక సమస్యలు తలెత్తుతాయి
చలికాలంలో వెచ్చగా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ, రాత్రిపూట స్వెటర్ వేసుకుని పడుకోవడం వల్ల కలిగే నష్టాలను గమనించాలి. నిద్రవేళలో తేలికపాటి దుస్తులు ధరించడం మంచిది. చలి ఎక్కువగా ఉంటే, దుప్పటిని బాగా కప్పుకోవాలి. మార్కెట్ లో తేలికగా ఉండి, వెచ్చదనాన్ని కలిగించే దుప్పట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటినైనా వాడొచ్చని సూచిస్తున్నారు. మనం రాత్రిపూట నిద్రపోయే సమయంలో శరీరం ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేస్తుంటుంది. వెచ్చిన బట్టలు ధరించి నిద్రపోవడంవల్ల ఈ పద్ధతి దెబ్బతిని శారీరక సమస్యలు తలెత్తుతాయి. నిద్ర నాణ్యతను, రక్త ప్రసరణను, చర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. స్వెటర్ ధరించి నిద్రపోయే అలవాటుంటే వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+