డీటాక్స్ డ్రింక్ తెలుసా.. 5 వారాల్లో బరువు తగ్గుతారు
మారుతున్న జీవనశైలి.. మారిపోయిన పనివేళలు.. మార్చుకుంటున్న ఆహార పదార్థాలతో చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతున్న సంఘటనలు కోకొల్లలు. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడంవల్ల బెల్లీ ఫ్యాట్ పేరుకుపోతోంది. వ్యాయామం చేస్తున్నప్పటికీ కొందరు బరువు తగ్గలేరు. అవి సరిపోవు.. బ్యాలెన్స్ డైట్ కూడా అవసరపడుతుంది. ఇంట్లో సొంతంగా తయారుచేసుకునే పానీయాలు బరువును సులభంగా తగ్గిస్తాయి.
డీటాక్స్ వాటర్ అనేది సాధారణమైన పౌష్ఠికాహార పానీయం. దీన్ని ఇంట్లో అందరూ తయారుచేసుకోవచ్చు. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నిమ్మకాయ, పుదీనా, అల్లం, నల్ల మిరియాలు ఉంటే సరిపోతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి జీవక్రియ మెరుగ్గా పనిచేసేలా చూస్తుంది. దీనివల్ల పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది. పుదీనా అనేది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అల్లం జీవక్రియను పెంచుతుంది. నల్ల మిరియాలు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి.

ఓ గ్లాసు నీళ్లలో ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇందులో 5-6 పుదీనా ఆకులు, కొద్దిగా అల్లం రసం, అర చెంచా నల్ల మిరియాల పౌడర్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని నీళ్లు కలపాలి. తర్వాత రాత్రంగా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయం నిద్ర లేవగానే పరగడుపునే తాగాలి. ఇలా ప్రతిరోజు చేస్తుంటే నాలుగు నుంచి ఐదు వారాల్లోనే ఫలితం వస్తుంది. ఇది కేవలం ఒక డైట్ మాత్రమే. వ్యాయామం మానేయడానికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యంపై, శరీరంపై సానుకూల ప్రభావం కనపడుతుంది. ఏదైనా చికిత్స తీసుకునేవారైతే మాత్రం ఒకసారి వైద్యుణ్ని సంప్రదించి ఈ డ్రింక్ తీసుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. డీటాక్స్ వాటర్ తీసుకుంటుంటే ప్రతిరోజ స్లిమ్ గా, ఫిట్ గా కనపడతారు.












Click it and Unblock the Notifications