Air purifiers: ఎయిర్ ప్యూరిఫైయర్స్‌తో తస్మాత్ జాగ్రత్త.. స్వచ్ఛమైన గాలితోనూ శ్వాసకోస వ్యాధులు

Air pollution: ఇండియాలో గాలి కాలుష్యం తీవ్రత అంతకంతకూ పెరుగుతూ పోతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిర్ పొల్యూషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇటీవల వాయు నాణ్యత సూచిక (AQI) 400 చేరుకోవడంతో ఏకంగా అత్యున్నత న్యాయస్థానం సైతం దీనిపై జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వాయు కాలుష్యం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండగా పలువురు ఎయిర్ ప్యూరిఫైయర్లపై ఆధారపడుతున్నారు. అయితే వీటి వాడకం విషయంలో జాగ్రత్త అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

శ్వాస ఆడటం కూడా కష్టంగా మారిన సమయంలోనూ గాలిని శుభ్రం చేయడానికి ఎయిర్ ప్యూరిఫైయర్లు ఎంతగానో సహాయపడతాయి. ఇవి గాలిలో ఉన్న విషకణాలను వడపోసి, స్వచ్ఛమైన గాలిగా మారుస్తాయి. దుమ్ము, పుప్పొడి, పొగ, జుట్టు వంటి వాటి నుంచి ఏర్పడే దుష్ప్రభావాలను తొలగించి ఇంట్లో గాలి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా అలర్జీలు లేదా ఆస్తమా ఉన్న వారికి ఎంతగానో సహాయపడతాయి.

Disadvantages with over usage of air purifiers

వివిధ ఎయిర్ ప్యూరిఫైయర్లు HEPA ఫిల్టర్లతో వస్తాయి. ఇవి 0.3 మైక్రాన్ల సైజు వరకు ఉన్న చిన్న కణాలను 99.97 శాతం మేర వడపోస్తాయి. తద్వారా ఇంట్లో గాలిని ఆరోగ్యకరంగా మారుస్తాయి. అయినప్పటికీ ఎయిర్ ప్యూరిఫైయర్లను అవసరానికి మించి వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువ ఫిల్టర్ చేసిన గాలి వల్ల కొన్ని రకాల అవసరమైన సూక్ష్మజీవులను శరీరం మిస్సవుతుంది. తద్వారా శరీరంలో ఇన్ఫెక్షన్లు మరియు అలర్జీలు సహా శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గాలిలో తేమ తగ్గిపోవడంతో చర్మం పొడిబారుతుంది. దీనితో సైనస్ తో పాటు దగ్గు వంటి ఇతర సమస్యలు వస్తాయి. అయోనైజేషన్ టెక్నాలజీతో కూడిన ప్యూరిఫైర్స్ వల్ల ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. వాటి ఉద్గారాల వల్ల తలనొప్పి, తల తిరగడం వంటివి కామన్‌గా అనుభవించాల్సి ఉంటుంది.

అవసరమైన మేరకు ఎయిర్ ప్యూరిఫైయర్లను వినియోగిస్తూ, దుష్ప్రభావాలను నివారించేందుకు ఒక పరిమితిలో వాడటం మంచిది. సరైన ప్యూరిఫైయర్ ఎంచుకునే సమయంలో ఓజోన్ మరియు VOC వంటి ఉద్గారాలను తక్కువ మోతాదులో రిలీజ్ చేసే మోడళ్లకు ప్రయారిటీ ఇవ్వాలి. తయారీ సంస్థ సూచనల మేరకు ఫిల్టర్లను క్రమానుగతంగా మార్చడం తప్పనిసరి. వీటిని పాటించడం ద్వారా ప్యూరిఫైయర్ల ద్వారా ప్రయోజనాలు పొందుతూనే దుష్ప్రభావాలను నివారించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+