చలికాలంలో నారింజ పండ్లు తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
నారింజ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. నారింజపండు లో విటమిన్ సి తో పాటు ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే చలికాలంలో నారింజ పండు తినాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. నారింజ పండు తింటే జలుబు చేస్తుందని తినడం మంచిది కాదని భావిస్తారు.
నారింజ పండుతో వీటి నుండి ఉపశమనం
అయితే డైటీషియన్లు మన శరీరానికి కావలసిన మంచి పోషకాలతో ఎన్నో ఆరోగ్య విలువలు కలిగిన నారింజ పండును శీతాకాలంలో తినొచ్చా లేదా అనే విషయాలను వెల్లడించారు. చలికాలంలో నారింజ పండ్లు తినడం చాలా మంచిది. నారింజపండు దగ్గు, జలుబు వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు నారింజపండు మనలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

నారింజ పండుతో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం
ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించి మనం ఆరోగ్యంగా ఉండడానికి నారింజపండు దోహదం చేస్తుంది. నారింజ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇది మన శరీరం లోపల ఉన్న టాక్సిన్స్ ను బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి మనలను చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది.
నారింజ పండుతో చర్మ ఆరోగ్యం
నారింజపండు తినడం వల్ల మన శరీరం ఎక్కువ సేపు తేమగా ఉంటుంది. అంతేకాదు చలికాలంలో చర్మం పొడిబారడం పగుళ్లు రావడం వంటి అనేక సమస్యలు నారింజపండు తినడం వల్ల తగ్గుతాయి. నారింజ పండు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన చర్మం నిగారింపు సంతరించుకునేలా చేస్తుంది. ముఖం పైన మొటిమలు రాకుండా చేస్తుంది. నారింజలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మన శరీరంలో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
నారింజ పండుతో గుండె ఆరోగ్యమే కాదు ఈ ప్రయోజనాలు కూడా
సిట్రస్ జాతికి చెందిన ఈ పండ్లను తినడం వల్ల మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్ నివారణకు కూడా నారింజ పండ్లు ఎంతో బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే డైటరీ ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కిడ్నీలలో రాళ్లు రాకుండా కాపాడుతుంది. నారింజ పండులో ఉండే పోషకాలు మన కంటి చూపును కూడా మెరుగుపరిచి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. కనుక చలికాలంలో నారింజ పండ్లను తినకూడదు అనే అపోహలను పక్కనపెట్టి హాయిగా నారింజ పండ్లను తినేయండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications