నెలలో ఎన్నిసార్లు శృంగారంలో మంచిదో తెలుసా..?
శృంగారం మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ భారతీయులు శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడటానికి వెనుకాడుతారన్నది ఒప్పుకోవాల్సిన విషయం. అయితే మారుతున్న కాలానుగుణంగా లైంగిక విద్యపై కూడా అవగాహన పెంపొందించడం ముఖ్యం.
అందుకే స్కూల్ స్థాయిలోనే శృంగారం సంబంధిత విద్యను బోధించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇది సరైన అవగాహనను పెంచడానికే కాకుండా ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించడంలో సహాయపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఏ పనిని అయినా ఎంత వరకు చేయాలి.. ఎలా చేయాలి అనే విషయాలు కూడా చాలా ముఖ్యం. ఆ విధంగానే నెలలో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి అనే ప్రశ్న జంటలకు తలెత్తుతుంది. ఈ విషయంపై నిపుణులు చెప్పే సూచనలు ఏంటో తెలుసుకుందాం..
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. శృంగారానికి నిర్దిష్టమైన సంఖ్య లేదు. ఇది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, వయస్సు.. భావోద్వేగం, భాగస్వాముల మధ్య సాన్నిహిత్యంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. పరస్పర అంగీకారం, జంట అనుభూతి చెందే సౌకర్యాన్ని బట్టి.. శృంగారం ఫ్రీక్వెన్సీని నిర్ణయించుకోవాలి.
సాధారణంగా రెండు లేదా మూడు సార్లు శృంగారం చేయడం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ విధంగానే నెలకు 8-10 సార్లు శృంగారం చేయడం జంటల మధ్య మానసిక ప్రశాంతతను పెంపోందిస్తుందని అంటున్నారు.

శృంగారం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..
హార్మోన్ల సమతుల్యం..
శృంగారం సమయంలో డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి.
స్ట్రెస్ తగ్గింపు..
శారీరక సాన్నిహిత్యం మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
హృదయ సమస్యలు తగ్గింపు..
రక్త ప్రసరణ మెరుగుపడటంతో హృదయ సంబంధిత సమస్యలు తగ్గే అవకాశముంది.
ఇమ్యూనిటీ పెంపు..
నియమిత శృంగారం రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
నిద్ర..
శృంగారం అనంతరం శరీరం రిలాక్స్ అవడం వల్ల నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందని తెలుస్తోంది.
అయితే మితిమీరిన శృంగారం శారీరక అలసట, కండరాల నొప్పులు, మానసిక ఒత్తిడి కలిగించవచ్చని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పురుషులు, మహిళల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications