ఈ ఆకు గురించి తెలిస్తే షాక్ అవుతారు.. ఆ వ్యాధుల్ని రానివ్వదు..!
మన ఇంటి పరిసరాలు, పొలాల మధ్యే అనేక రకాల ఆయుర్వేద, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు దొరుకుతుంటాయి. చాలా మంది వీటిని పిచ్చి మొక్కలు అని అనుకుంటారు. కానీ వాటిలో చాలా వరకు మొక్కలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను చెక్ పెడుతుంటాయి. పెద్దవాళ్లు మాత్రమే ఈ మొక్కలను గుర్తించి వాడతారు. ఇప్పటి యువతకు ఈ మొక్కల గురించి అసలు తెలియదు. ఇక తిప్పతీగ పల్లెల్లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంటుంది. పొలాల గట్లు, చెట్లపై పాకుతూ ఉంటుంది. పట్టణ శివారుల్లోనూ రోడ్ల పక్కన పొదల్లో ఎక్కువగా కనిపిస్తుందీ తీగ. ఈ తీగ కరోనా సమయంలో బాగా వాడుకలోకి వచ్చింది.
కొవిడ్-19 సమయంలో ఈ తిప్పతీగతోనే రోగనిరోధక శక్తిని పెంచుకున్నారు చాలా మంది. తిప్పతీగ ఆకుల్ని మెత్తగా నూరి.. గోలీల్లా ఉండలు చేసి ఉదయం, సాయంత్రం మింగితే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు సూచనలు చేశారు. ఆ తర్వాత తిప్పతీగనే మందులుగా చేసి ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే తిప్పతీగతో ఇతర అనేక రోగాలను తరిమేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

తీప్పతీగను కిడ్నీ సంబంధిత వ్యాధులు, మధుమేహం, తల్లుల్లో స్తన్యవృద్ధి సహా అనేక రకాల అనారోగ్యాలు తగ్గించేందుకు వాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నవారికి తిప్పతీగ ఆకులు, వేర్లు ప్రయోజనకరంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. తిప్ప తీగను రోజూ వాడుకోవడం చాలా ఉపయోగకరం అని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే తిప్పతీగ ఆకుల్ని ఎండబెట్టి వాటిని గ్లాసులో మరిగించి తాగితే క్యాన్సర్, షుగర్ తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications