కాఫీ తాగండి... నెలరోజుల్లో సులువుగా బరువు తగ్గుతారు
ప్రస్తుత రోజుల్లో బరువు ఎక్కువగా ఉండటం అనేది సాధారణంగా మారిపోయింది. మారుతున్న జీవనశైలితోపాటు మారిపోయిన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడంలాంటివెన్నో అధిక బరువుకు కారణమవుతున్నాయి. తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కొద్దిమందికే ఫలితం కనిపిస్తుంటుంది. ఒకవేళ ఫలించినా అవి తాత్కాలికమే అవుతాయి. అటువంటివారి కోసం ఒక చిట్కా ఉంది. దీన్ని ఫాలో అయితే బరువు సులభంగా తగ్గుతారు.
నిత్యం కాఫీ తాగనిదే రోజు గడవనివారు ఎందరో ఉన్నారు. పరిమితంగా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తోంది. ప్రతిరోజు మనం తాగే కాఫీలో పావుస్పూన్ దాల్చిన చెక్క పొడి, టేబుల్ స్పూన్ కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే దీన్నితాగడంవల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. క్యాలరీలు కరిగే వేగం బాగా పెరిగి బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడితే మలబద్దకం లాంటి సమస్యలు ఎదురుకావు.

అంతేకాదు.. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు రావు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీనివల్ల చాలామంది సులువుగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఉదయాన్నే వేడినీళ్లు తాగడంవల్ల కూడా జీర్ణశక్తి పనితీరు మెరుగుపడుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
అయితే కాఫీని ఎప్పుడూ పరిమితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది. అంతేకాదు నిద్రలేమికి కారణమవుతుంది. అజీర్ణం, తలనొప్పితోపాటు కాఫీ గర్భస్రావానికి దారితీస్తుంది. పైబ్రోసిస్టిక్ రొమ్ములో ప్రమాదం పెరుగుతుంది.ప్రతిరోజు పెద్దమొత్తంలో కెఫిన్ తీసుకునే మహిళలకు బ్రెస్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంలో తేలింది.












Click it and Unblock the Notifications