బీరు తాగితే అవి తగ్గుతాయా?
మూత్రంలో కొన్ని ఖనిజాలు ఎక్కువగా ఏర్పడినప్పుడు అవి మూత్రపిండాల్లో పేరుకుపోతాయి.
ప్రజల్లో ఎక్కువమంది కిడ్నీల ఆరోగ్యం విషయంలో వదంతులనే నమ్ముతారు. అలాంటివాటిలో బీరు ఎక్కువగా తాగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు అనేది ఒకటుంది. అయితే ఇది అత్యంత ప్రమాదకరమైన వదంతి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యం విషయంలో చాలామంది తమకు తెలిసినదే నిజమనుకుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

మూత్రంలో ఖనిజాలు ఎక్కువగా ఏర్పడినప్పుడు
మూత్రంలో కొన్ని ఖనిజాలు ఎక్కువగా ఏర్పడినప్పుడు అవి మూత్రపిండాల్లో పేరుకుపోయి ఘన పదార్థంగా ఏర్పడతాయి. వీటినే కిడ్నీ స్టోన్స్ అంటారు. కిడ్ల్నీల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం బీపీ, షుగరు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినట్లు గుర్తించాలంటే పొత్తికడుపు నొప్పిగా ఉండటం, నడుం పైభాగంలో లేదా లేదా గజ్జలో విపరీతమైన నొప్పి, కొన్నిసార్లు మూత్రంలో రక్తం కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలు గుర్తిస్తే పరీక్షలు చేయించుకోవడం మంచిది.

సర్జరీ చేసి బయటకు తీయవచ్చు
కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను సర్జరీ చేసి బయటకు తీయవచ్చు. లేదంటే మూత్రంతో పాటు బయటకు వెళ్లేలా వాటిని చిన్న ముక్కలుగా చేయవచ్చు. నీరు ఎక్కువగా తాగితే, మూత్రంతో పాటు కిడ్నీల్లో ఏర్పడే చిన్న రాళ్ల పలుకులు శరీరం నుంచి బయటకు వెళ్తాయి. అయితే బీర్ తీసుకున్నా మూత్రవిసర్జన ఎక్కువగా అవుతుంది. కానీ ఈ సందర్భంలో మూత్రపిండాల్లో రాళ్లు బయటకు వెళ్తాయని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

బీరు తీసుకోవడం సరైన చర్య కాదు
మద్యపానం సేవించడం ఇతర దుష్ప్రభావాలకు కూడా దారితీస్తుంది కాబట్టి బీరు తీసుకోవడం సరైన కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని వైద్యనివేదికలు చెబుతున్నాయి. వైద్యుల సలహాతో తగినంత నీరు తాగడం, ఆహారంలో మార్పులుచేసుకోవడం వంటివాటితో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బీరు తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడవు అనే వందతిని నమ్మి అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications