లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి!!
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము దేనికదే ముఖ్యమైంది. అన్ని అవయవాలు సరిగా పనిచేస్తేనే మనం మన పని సక్రమంగా చేసుకోగలుగుతాం. ఏ ఒక్క అవయవానికి సమస్య వచ్చిన అది మన శరీరం మొత్తం పైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మన శరీరంలో లివర్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
లివర్ ఆరోగ్యం కోసం ఆహారపు అలవాట్లు
శరీరంలో లివర్ చాలా పనులను చేస్తుంది. కాబట్టి కాలేయం ఆరోగ్యం పైన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి. లివర్ ఆరోగ్యం కోసం మంచి ఆహారపు అలవాట్లను చేసుకోవాలి. లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకునేవారు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. లివర్ ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

ఇవి తాగితే లివర్ ఆరోగ్యం .. యాపిల్ తోనూ
బ్లాక్ టీ, గ్రీన్ టీ వంటి వాటిని తీసుకుంటే మంచిది. ముఖ్యంగా గ్రీన్ టీని తాగడం వల్ల లివర్ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇక కొన్ని రకాల పండ్లు కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. లివర్ ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ప్రతిరోజు యాపిల్ తింటే కూడా మంచిది. యాపిల్ తినడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల లివర్ డిటాక్స్ అవుతుంది. యాపిల్ లివర్ ఫ్యాట్ ను కూడా బాగా తగ్గిస్తుంది.
వీటిలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు,.. వీటిని తినండి
లివర్ ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు అవకాడోని తీసుకోవడం మంచిది. అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు లివర్ ను కాపాడతాయి. లివర్ లో ఉండే చెడు కొవ్వులను ఇది బయటకు పంపుతుంది. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బెర్రీస్ ను తినాలి. బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ ఏది తిన్నా లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇవి లివర్ పైన ఒత్తిడి పడకుండా చేస్తాయి.
బొప్పాయి లివర్ సమస్యలకు చెక్ పెడుతుంది
లివర్ ని ఆరోగ్యంగా ఉంచటంలో బొప్పాయి కూడా కీలకంగా పనిచేస్తుంది. బొప్పాయి లో ఉండే విటమిన్లు, ఎంజైమ్ లు లివర్ పైన పనిభారాన్ని బాగా తగ్గిస్తాయి. లివర్ ఫ్యాట్ ను దూరం చేస్తాయి. అంతే కాదు లివర్ ఆరోగ్యం కోసం సిట్రస్ పండ్లను, కివి పండ్లను కూడా తీసుకుంటే మంచిది. ఏది ఏమైనా లివర్ ను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications