చికెన్ లివర్ తింటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి!
చాలామంది చికెన్ ను చాలా ఇష్టంగా తింటారు. చికెన్ ఇష్టంగా తినే వాళ్ళు కొందరు చికెన్ లో ఉండే లివర్ ను తినడానికి మాత్రం ఇష్టపడరు. కొందరైతే చికెన్ లివర్ ని చాలా ఇష్టంగా తింటారు. అయితే చికెన్ లివర్ లో ఉండే పోషకాలు ఏమిటి? చికెన్ లివర్ తినడం మంచిదా కాదా? చికెన్ లివర్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి.
చికెన్ లివర్ లో బోలెడు పోషకాలు
చికెన్ లివర్ తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా దీనిగురించి తెలుసుకుంటే కచ్చితంగా చికెన్ లివర్ తింటారు. ఇంతకీ చికెన్ లివర్ లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అంటే..చికెన్ లివర్ లో విటమిన్ ఏ, విటమిన్ బి, ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్ బి12, ఐరన్, ఫోలేట్, కాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మేక లివర్ తో పోలిస్తే చికెన్ లివర్ లోనే మన శరీరానికి కావలసిన పౌష్టికాహారం దొరుకుతుంది.

చికెన్ లివర్ తో గుండె ఆరోగ్యం
చికెన్ లివర్ లో ఫోలేట్ ఉంటుంది. ఇది లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. చికెన్ లివర్ తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. చికెన్ లివర్ లో సెలీనియం ఉంటుంది. అది గుండెజబ్బుల నుంచి రక్షణ ఇచ్చి గుండె సమస్యలను మనకు లేకుండా చేస్తుంది. ప్రస్తుత సమాజంలో గుండె సమస్యలు ప్రాణాన్ని హరిస్తున్న పరిస్థితి ఉంది.గుండె ఆరోగ్యంగా ఉండాలని భావించేవారు చికెన్ లివర్ ను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.
చికెన్ లివర్ తో కీళ్ళ నొప్పులకు చెక్
చికెన్ లివర్ ఆహారంలో భాగంగా తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, నులిపురుగుల వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే చికెన్ లివర్ ను తరచుగా తినడం మంచిది కాదు. ఒకవేళ దీనిని తరుచుగా తింటే బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇక గర్భిణీ స్త్రీలు దీనిని తినకుండా ఉండటమే ఉత్తమం అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
క్యాన్సర్ నుండి కాపాడే చికెన్ లివర్
చికెన్ లివర్ ను తీసుకోవడం వల్ల చికెన్ లివర్ లో ఉండే పోషకాలు మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చికెన్ లివర్ లో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంతేకాదు చికెన్ లివర్ వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా రక్షించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చికెన్ లివర్ తో డయాబెటిస్ కంట్రోల్
పోషకాహార లోపంతో బాధపడేవారు చికెన్ లివర్ తింటే వారి శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. చికెన్ లివర్ తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో చికెన్ లివర్ ఎంతో బాగా పనిచేస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications