ఇవి పచ్చివి తినండి... జీవితంలో డాక్టర్ అవసరం రాదు!
కొన్నిరకాల కూరగాయలను వండకుండా పచ్చివి తినడంవల్లే అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. వండటంవల్ల పోషకాలు తగ్గిపోతాయి. అటువంటివాటిల్లో ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా, బీట్ రూట్ ముందుంటాయి. పోషకాహార నిపుణులు కూడా వీటిని వండకుండా అవకాశం ఉన్నంత వరకు పచ్చివే తినాలని సూచిస్తున్నారు.
ఉల్లిపాయలు : ఉల్లిపాయలు తినడం వేసవికాలంలో ఎంతో మేలు. కొవ్వును తగ్గించడంలో వీటి పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది. సరిగ్గా వీటిని తినగలిగితే తక్కువ సమయంలో బరువు తగ్గుతారు. వీటిల్లో 95 శాతం నీరు ఉంటుంది. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించడంలో తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఇథనాల్ రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. కొందరు పండులాగా, సలాడ్ లా తింటుంటారు. కూరల్లో ఎక్కువగా వడ్డిస్తారు. ఉల్లిపాయను వండకుండా తినడమే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

క్యారెట్ : క్యారెట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇది కూడా బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. దీన్ని సలాడ్‌లు, శాండ్‌విచ్‌ల ద్వారా తింటుంటారు. జ్యూస్ లు, సూప్‌లా చేసుకోవచ్చు. వండిన క్యారెట్ కంటే పచ్చి క్యారెట్లు ఎక్కువ పోషకాలను కలిగివుంటాయి.
టమాటా : ఇవి పచ్చివే తినడంవల్ల ఎక్కువ లాభం చేకూరుతుంది. టమాటా రసం కొలెస్ట్రాల్ తో బాధపడేవారికి ఎంతో ఉపయోగం. లైకోపీన్ సమృద్ధిగా ఉండటంతో లిపిడ్ స్థాయిలను పెంచే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్, నియాసిన్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఊబకాయాన్ని తగ్గించడంలో పచ్చి టమాటాలు దోహదపడతాయి.
బీట్ రూట్ : ఫోలేట్ (విటమిన్ B9), మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, ఇనుము, విటమిన్ సి వీటిల్లో పుష్కలంగా ఉంటాయి. చర్మానికి ఉపయోగపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంది. వీటిని పచ్చిగా తినడం చాలా మంచిది. ఉదయం టిఫిన్ సమయంలో తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications