పల్లీలు తిన్న వెంటనే నీరు తాగుతున్నారా? ప్రమాదంలో మీ ఆరోగ్యం!
మనలో చాలా మంది సీజన్ తో సంబంధం లేకుండా వేడి వేడి పల్లీలు తింటాం. ఇందులో పుష్కలముగా ఉండే ప్రోటీన్ లు శరీరానికి చాలా ప్రయోజనకరం. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే వెరుశనగలు అందిరికి అందుబాటులో ఉంటాయి. అయితే, వేరుశెనగల గురించి కొన్ని అపోహలు చాలామందిలో ఇప్పటికీ ఉన్నాయి. ముఖ్యంగా వేరుశనగ తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు వస్తుందా? నిజంగా ఇది ఆరోగ్యానికి హానికరమా? ఇందులో వాస్తవమెంత? వైద్యుల సూచనలేంటి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, వేరుశెనగలు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల దగ్గు రావడం అనేది అవాస్తవం. ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఆరోగ్యంగా ఉన్నవారికి దీనివల్ల ఎలాంటి ప్రత్యక్ష దుష్ప్రభావాలు ఉండవు. అయితే వేరుశనగల్లో ప్రోటీన్ తో పాటు ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉండటంతో, ఇవి తిన్న వెంటనే ఎక్కువ నీరు తాగితే కొందరికి కడుపు భారంగా అనిపించడం, గ్యాస్ లేదా అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. కొంత మందికి సీజన్ తో సంబంధం లేకుండా సాధారణంగా దగ్గు వస్తుంది. ఈ క్రమంలోనే పల్లీలు తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు వస్తుందనే అపోహాను ప్రజల్లోకి గట్టిగా పంపించేశారు కొందు.
వేరుశనగలలో పోషకాలు
వేరుశెనగలు శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి మంచి ప్రోటీన్ వనరుగా ఉండి కండరాల బలానికి తోడ్పడతాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ E, విటమిన్ B కాంప్లెక్స్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఇనుము, జింక్ వంటి ఖనిజాలు కూడా ఇందులో ఉన్నాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఈ తప్పులు చేయకండి..
వేరుశెనగలు ఆరోగ్యానికి మంచివే అయినా, అధికంగా తింటే బరువు పెరగడం, కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ ఉప్పుతో వేరుశెనగలు తినడం వల్ల రక్తపోటు సమస్యలు పెరగవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో ఎక్కువ మొత్తంలో వేరుశెనగలు తినడం కూడా గ్యాస్, ఆమ్లత్వానికి కారణమవుతుంది.
వేరుశెనగలు చలికాలంలో శరీరానికి శక్తినిచ్చే మంచి ఆహారం. అయితే వేరుశెనగ తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు వస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. కొద్దిసేపు గ్యాప్ తీసుకుని నీరు తాగితే ఎలాంటి సమస్య ఉండదు. మితంగా, సరైన సమయంలో తీసుకుంటే వేరుశెనగలు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. వేరుశెనగలు తిన్న తర్వాత 10-15 నిమిషాల విరామం తీసుకుని నీరు తాగితే జీర్ణక్రియకు మంచిది.
-
సమ్మర్ స్పెషల్.. అటుకులతో పాయసం.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్.. -
సమ్మర్ లో చలువ చేసే 'సొరకాయ మజ్జిగ పులుసు'.. క్షణాల్లో ఇలా చేసుకోండి..! -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications