నయా స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ.. ఇదొక్కడి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!
రోజుకో గుడ్డు తినాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. గుడ్డులో అనేక పోషకాలు దాగి ఉన్నాయి. రోజూ గుడ్డు తినడం ద్వారా అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే గుడ్డును పరిపూర్ణమైన ఆహారం అంటారు. ఇక గుడ్డుతో అనేక రకాల వంటలు చేసుకుంటారు. గుడ్డు పులుసు, ఫ్రై ఇలా వివిధ పద్దతుల్లో వంట చేసుకుంటారు. అయితే అఫ్ఘానీ స్టైల్ లో ఎగ్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా..? సూపర్ టేస్టీగా ఉండే ఈ ఎగ్ మసాలా కర్రీని ఈజీగా తయారు చేసుకోవచ్చు..
నయా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. గుడ్లు ఉడకపెట్టినవి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పెరుగు, జీడిపప్పు, కరివేపాకు, అల్లం పేస్టు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఉప్పు, కొత్తిమీర తరుగు తీసుకోవాలి. ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా ఎగ్స్ ను ఉడకపెట్టుకోవాలి. గుడ్లు ఉడికేలోపు పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర తరుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయాలి.

ఇప్పుడు ఉల్లిపాయ, జీడిపప్పుల మిశ్రమం, కొత్తిమీర వేసి పేస్టు మాదిరి చేసుకోవాలి. కర్రీ కోసం అదే గిన్నెలో నూనె పోసి షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయాలి. ఆ మిశ్రమంలోనే అల్లం పేస్టు, ఉల్లిపాయ పేస్టు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగు, పసుపు, తగినంత ఉప్పు వేయాలి. అందులోనే ఉడికించిన ఎగ్స్ వేసి ఉడికించుకోవాలి. చివరగా మసాలా వేస్తే సరి.. సూపర్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ సిద్ధం..












Click it and Unblock the Notifications