మంచినీళ్లు రోజుకు ఎన్ని తాగుతున్నారు?

మంచినీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. ప్రతిరోజు కచ్చితంగా మనిషి రెండులీటర్ల కన్నా ఎక్కువ నీరు తాగాలి. లేదంటే కనీసం 8 గ్లాసుల నీరైనా తాగాలి. అయితే ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గ్లాసులతో కొలిచి తాగడం సరికాదని తేల్చారు. అలాంటప్పుడు 2 లీటర్లకన్నా ఎక్కువ నీరు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. మనం తినే ఆహారం ద్వారానే శరీరానికి కావల్సిన నీరు లభిస్తుందని వారి పరిశోధనలో వెల్లడైంది. రెండు లీటర్ల నీరు కచ్చితంగా తాగాలంటూ దాహం వేయకపోయినా కొందరు తాగుతుంటారు. అతిగా నీరు తీసుకోకూడదని, ఎవరెవరు ఎంత నీరు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదని తేల్చారు.

వారు చేసే పని, ఉండే ప్రదేశం, ఆహారపు అలవాట్లు.. ఇలా అనేకరకాల అంశాలపై నీరు తాగడమనేది ఆధారపడివుంటుంది. అంతేకాదు.. వయసు, నివసిస్తున్న ప్రదేశం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? అక్కడి ఉష్ణోగ్రత ఎంత? వాతావరణ పరిస్థితులు, శారీరకంగా ఎంత కష్టపడుతున్నారు? ఇలాంటివాటిపై నీరు తీసుకోవడం ఆధారపడివుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు నీరు తాగినా అంతగా ప్రయోజనం ఉండదు.

every daytake 8 glasses of water is healthy

వ్యాయామానికి ముందు, వ్యాయామం అయిన తర్వాత లేదంటే బాగా దప్పిక వేసినప్పుడు మాత్రమే నీరు శరీరానికి బాగా ఉపయోగడపతాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీనికోసం సైంటిస్టులు 23 దేశాలకు చెంది 5604 మంది మీద అధ్యయనం చేశారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే వారు తుది నిర్ణయానికి వచ్చి పైన పేర్కొన్న అంశాలను ప్రకటించారు. నీరు ఎంత తీసుకున్నా మంచిదే అన్న భ్రమలో ఎవరూ ఉండొద్దని, ఎక్కువ నీరు తీసుకోవద్దని, అలా తీసుకుంటే ఎన్నో అనర్థాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+