Fenugreek Leaves Benefits: మెంతికూర తినడం లేదా.. అయితే మీరు నష్టపోయినట్లే..!
చాలా మది మెంతులు తినడానికి ఇష్టపడరు. అలాగే మెంతి కూర ఎక్కువగా తినరు. కానీ వీటి ప్రయోజనాలు తెలిస్తే తనికుండా ఉండలేరు. మెంతి ఆకులతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మెంతిఆకులను మెంతి పరాటా, ఆలూ మెంతి, చికెన్ మెంతి వంటి ఎన్నో కూరల్లో వేస్తుంటారు.

గుండె
మెంతి ఆకుల్లో ఉండే పోషకాలు గుండెకు చాలా రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆకుల్లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే కంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందట. మెంతిఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారకాలు మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

విటమిన్ కె
మెంతి ఆకుల్లో విటమిన్ కె అధిక పరిమాణంలో లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి ఆకులు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. మెంతి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయట.

బరువు
బరువు తగ్గాలనుకునే వారికి మెంతి ఆకులు చక్కటి ఆహారం. ఆకులలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. మెంతి ఆకులో ఉండే కార్బోహైడ్రేట్లు, చక్కెర శోషణను మరింత నియంత్రిస్తుందట. మెంతి ఆకులల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని విషాన్ని బయటకు పంపడానికి, మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

జుట్టు
మెంతి ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఎన్నో ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల మీ జుట్టు ఊడిపోవడం తగ్గుతుందట.












Click it and Unblock the Notifications