Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొవ్వుతోనే కొవ్వుకు చెక్: మన శరీరంలోని 'బ్రౌన్ ఫ్యాట్' రహస్యం..

పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ఇకపై కేవలం ఆకలిని చంపుకోవాల్సిన అవసరం లేదు. మన శరీరంలోని కొవ్వునే ఇంధనంగా మార్చి, కరిగించే సరికొత్త అద్భుత వ్యవస్థను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శరీరంలో పేరుకుపోయిన 'తెల్ల కొవ్వు'ను కరిగించే 'బ్రౌన్ ఫ్యాట్' (Brown Fat) నెట్‌వర్క్‌ను ఎలా యాక్టివేట్ చేయవచ్చో వివరిస్తూ 'నేచర్ కమ్యూనికేషన్స్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన వివరాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

సాధారణంగా మన శరీరంలో ఉండే 'వైట్ ఫ్యాట్' (తెల్ల కొవ్వు) మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చి నిల్వ చేస్తుంది. ఇది ఎక్కువైతేనే స్థూలకాయం వస్తుంది. కానీ 'బ్రౌన్ ఫ్యాట్' దీనికి పూర్తి విరుద్ధం. ఇది ఒక 'జీవక్రియ సింక్' లాగా పనిచేస్తుంది. అంటే, ఇది పోషకాలను కొవ్వుగా నిల్వ చేయనివ్వకుండా, వాటిని వేగంగా వేడి (Heat) రూపంలోకి మార్చి కరిగించేస్తుంది. ఈ ప్రక్రియనే శాస్త్రవేత్తలు 'థర్మోజెనిసిస్' అని పిలుస్తారు.

Fight Obesity with Science Researchers Discover How SLIT3 Protein Builds Networks to Boost Metabolism

SLIT3 ప్రొటీన్.. విభజించి పాలించు!

ఈ బ్రౌన్ ఫ్యాట్ సమర్థవంతంగా పనిచేయాలంటే దానికి దట్టమైన నరాలు, రక్తనాళాల నెట్‌వర్క్ అవసరం. ఈ నెట్‌వర్క్‌ను నిర్మించడంలో 'SLIT3' అనే ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుందని న్యూయార్క్ యూనివర్సిటీ (NYU) పరిశోధకులు గుర్తించారు. విశేషమేమిటంటే, ఈ ప్రొటీన్ విడుదలైన తర్వాత రెండు భాగాలుగా విడిపోతుంది. ఒక భాగం రక్తనాళాల వృద్ధిని చూసుకుంటే, మరో భాగం నరాల వ్యవస్థను విస్తరిస్తుంది. ఈ రెండు వ్యవస్థలు కలిసి బ్రౌన్ ఫ్యాట్‌కు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను అందిస్తూ కొవ్వును వేడి రూపంలో కరిగిస్తాయి.

పాము పేగుల్లో అద్భుతం.. కొండచిలువ నుంచి వెయిట్ లాస్ సీక్రెట్!
పాము పేగుల్లో అద్భుతం.. కొండచిలువ నుంచి వెయిట్ లాస్ సీక్రెట్!

స్థూలకాయానికి సరికొత్త మందు?

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బరువు తగ్గే మందులు (GLP-1 వంటివి) ఎక్కువగా ఆకలిని తగ్గించడం ద్వారా పనిచేస్తాయి. కానీ ఈ కొత్త పరిశోధన ఆకలిని తగ్గించడం కంటే, శరీరం వినియోగించుకునే శక్తిని (Energy expenditure) పెంచడంపై దృష్టి పెడుతోంది. సుమారు 15,000 మందిపై జరిపిన విశ్లేషణలో, స్థూలకాయం ఉన్నవారిలో ఈ SLIT3 ప్రొటీన్ పనితీరు ఇన్సులిన్ సున్నితత్వాన్ని, కొవ్వు కణజాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని తేలింది.

షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు..
షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు..

మౌలిక సదుపాయాలే ముఖ్యం..

"కేవలం శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ ఉంటే సరిపోదు, అది వేడిని ఉత్పత్తి చేయడానికి కణజాలం లోపల సరైన మౌలిక సదుపాయాలు (నరాలు, రక్తనాళాలు) ఉండాలి" అని ఈ అధ్యయన సీనియర్ రచయిత ఫర్నాజ్ షమ్సీ వివరించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ ప్రొటీన్ లేని పక్షంలో అవి చలిని తట్టుకోలేకపోయాయని, వాటిలో కొవ్వు కరిగే ప్రక్రియ మందగించిందని గుర్తించారు. భవిష్యత్తులో ఈ SLIT3 ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని తయారు చేసే చికిత్సలు స్థూలకాయం, జీవక్రియ సంబంధిత వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపే అవకాశం ఉంది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+