నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి!!
నిద్ర మనిషికి కచ్చితంగా అవసరం. మనిషి జీవితంలో నిద్ర ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం, మధ్యలో ఎటువంటి అవాంతరాలు లేకుండా నిద్రపోవడం చాలా అవసరం. మన జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండడానికి కీలక భూమిక పోషించే నిద్ర మనకు అనేక కొత్త విషయాలను కూడా చెబుతోంది. మనం నిద్ర పోయే భంగిమ మన వ్యక్తిత్వాన్ని చెబుతుంది. నమ్మశక్యంగా లేకుంటే ఈ ఆర్టికల్ చదివేయండి.. మీకే అర్థమవుతుంది.

నిద్రా భంగిమలు మన వ్యక్తిత్వం గురించి ఏం చెప్తున్నాయి?
నిద్ర విషయంలో ఒక్కొక్కరూ ఒకలా పడుకుంటారు. కొందరు వెల్లికలా పడుకుంటే, మరికొందరు బోర్లా పడుకుంటారు. కొందరు పక్కకు తిరిగి తల కింద చెయ్యి పెట్టుకుని పడుకుంటే, మరికొందరు చిన్నపిల్లల మాదిరిగా కాళ్లు ముడుచుకొని పడుకుంటారు. ఇలా రకరకాల భంగిమల్లో పడుకునే వారు రకరకాల వ్యక్తిత్వాలను కలిగి ఉంటారని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇక ఇంతకీ ఏ వైపు తిరిగి పడుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి.. నిద్రా భంగిమలు మన వ్యక్తిత్వం గురించి ఏం చెబుతున్నాయి అంటే..

పక్కకు తిరిగి కాలు ముడుచుకుని పడుకునే వారి వ్యక్తితం ఇలా
చాలామంది పక్కకు పక్కకు తిరిగి పడుకుని కాలు ముడుచుకుని నిద్ర పోతూ ఉంటారు. ఇక ఇటువంటి వారి గురించి చెప్పాలంటే వారు చాలా కష్టపడి పనిచేస్తారు. చిన్న విషయాలకే బాగా బాధ పడతారు. వారిలో అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు. ఇక కుడిచెయ్యి తల క్రిం పెట్టుకొని కుడివైపుకు తిరిగి పడుకుంటే పడుకునే వారు ఎక్కువ ఆత్మ విశ్వాసాన్ని కలిగి వుంటారు. ఎక్కువ పనుల్లో వారు విజయం సాధిస్తారు. భిన్నమైన దారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తారు. వారికి అధికారం మరియు సంపద కూడా తోడుగా నిలుస్తాయి.

అలా పడుకునే వారిలో క్రియేటివిటీ ఎక్కువ
ఇక ఎడమ చెయ్యిని తల కింద పెట్టుకొని పడుకుంటే వారు మంచితనం కలిగిన వారై ఉంటారు. వారికి పెద్దలంటే గౌరవం ఉంటుంది. చేసే పనిలో నిబద్ధత ఉంటుంది. కాని వారిలో ఆత్మవిశ్వాసం కాస్త తక్కువగా ఉంటుంది. ఇక వీరిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఒక గొప్ప గుణం క్రియేటివిటీ. చాలా చక్కని క్రియేటివిటీని కలిగి ఉంటారు. ఇక కాళ్లు చేతులు బార్లా చాపి వెల్లకిలా పడుకునే వారు స్వేచ్ఛ ప్రియులుగా ఉంటారు. నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపును కోరుకుంటారు.

బోర్లా పడుకునే వారి స్వభావం ఇలా
ఇక రెండు చేతులు తలగడగా బోర్లా పడుకుంటే అటువంటి వారు సంకుచిత స్వభావం కలిగి ఉంటారు అవసరమైతేనే మాట కలిపే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వారిలో అలసత్వం ఎక్కువ. ఎలాంటి లక్ష్యం లేకుండా వారు తమ జీవితాన్ని గడుపుతారు. ఇక పడుకునేటప్పుడు ఒకే పక్కకు తిరిగి రెండు కాళ్ళు ముడుచుకుని పడుకుంటే వారిలో స్వార్ధం, అసూయ ఎక్కువగా ఉంటాయని , పగ ప్రతీకారాలకు వారు ప్రతీకగా ఉంటారని చెబుతారు.

నిద్రించే భంగిమ బట్టి వ్యక్తిత్వం
ఇక ఇటువంటి వారికి ఎవరైనా భయపడి దూరంగా పారిపోతారు. అంతేకాదు వీరు త్వరగా మోసపోయే అవకాశం ఉంటుందని, వీరు ప్రపంచం నుంచి రక్షణ, భద్రత కూడా కోరుకుంటారని చెబుతారు. మొత్తంగా చూస్తే నిద్రించే భంగిమను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని, వారి ఆత్మ విశ్వాసాన్ని తెలుసుకోవచ్చని అధ్యయనాల ద్వారా వెల్లడైందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications