మటన్, చికెన్ కంటే చేపలు బెస్ట్... ఎందుకో తెలుసుకోండి!
చాలామంది మాంసాహారాన్ని బాగా ఇష్టంగా తింటారు. ముక్క లేకుంటే ముద్ద దిగని వారు చాలామంది ఉన్నారు. అయితే విపరీతంగా మాంసాహారం తినేవారు మాంసాహారం తినడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మటన్, చికెన్ కంటే మాంసాహారంలో చేపలు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి అనే విషయాన్ని ప్రతిఒక్కరు తెలుసుకోవాలి. చికెన్, మటన్ కంటే చేపలు ఎందుకు బెస్ట్? ఎంత బెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది.
మాంసాహారం రెండు రకాలు రెడ్ మీట్, వైట్ మీట్
మాంసాహారంలో రెడ్ మీట్, వైట్ మీట్ అని రెండు రకాలు ఉంటాయి. రెడ్ మీట్ అంటే మేకలు గొర్రెల మటన్, పోర్క్, బీఫ్ ఇలాంటి జంతువుల మాంసాన్ని రెడ్ మీట్ అంటారు. ఇక వైట్ మీట్ అంటే.. కోళ్లు, పక్షులు, రొయ్యలు, పీతలు, చేపల మాంసం. అయితే వైట్ మీట్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. రెడ్ మీట్లో ప్రోటీన్ తో పాటుగా ఫ్యాట్ కూడా ఉంటుంది.

మటన్, చికెన్ కంటే చేపలు బెస్ట్
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కనుక రెడ్ మీట్ కంటే వైట్ మీట్ మంచిదని చెబుతారు. అయితే వైట్ మీట్ లో కూడా చేపలు చాలా మంచివని, చేపలలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయని ఫలితంగా అనేక అనారోగ్య సమస్యల నుండి రక్షణ కలుగుతుందని చెబుతారు.
చేపలు తింటే ఆరోగ్యానికి నో డేంజర్
మటన్, చికెన్ తింటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, వీటి వల్ల కొవ్వు పెరిగి కార్డియో వాస్కులర్ జబ్బులకు కారణం అవుతుందని చెబుతున్నారు. మటన్, చికెన్ ఎక్కువగా తినడం వల్ల గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాలు మూసుకుపోయి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అయితే చేపలు తినడం వల్ల ఇలాంటి ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని చెబుతున్నారు.
చేపలతో ఆరోగ్యం, ఈ రోగాలకు చెక్
నాన్ వెజ్ ఆహారాలలో సీ ఫుడ్స్ చాలా మంచివని అనేక పరిశోధనలు కూడా తేల్చాయని చెబుతున్నారు. ముఖ్యంగా చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు మన శరీరానికి పోషణ ఇవ్వడంతో పాటుగా బిపి, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను కంట్రోల్లో ఉంచుతాయి.
చేపలు తరచూ తినండి
మెదడు సంబంధిత సమస్యల నుంచి కూడా చేపలు కాపాడతాయి. కళ్ళ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి చేపలు ఎంతగానో దోహదం చేస్తాయి. కనుక మటన్, చికెన్ తినే బదులు వారంలో రెండు మూడు రోజులు చేపలు తినండి. నాన్ వెజ్ తింటూనే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications