జుట్టు ఊడిపోతుందా? అయితే ఈ 6 తీసుకోండి
ఒక్కోసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జుట్టు మాత్రం రాలుతూనే ఉంటుంది. దీనికోసం ప్రజలు వివిధ ఉత్పత్తులు, మందులను వాడుతుంటారు. అయితే జుట్టు పెరుగుదలకు, బలానికి అవసరమైన ఆహారం మాత్రం తీసుకోరు. చాలా కీలకమైన పాత్ర పోషించే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు ఊడిపోవడానికి, జుట్టు మెరిసేలా దృఢంగా మార్చడానికి తీసుకోవల్సిన ఆహార పదార్థాలను తెలియజేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడి గుడ్డు : జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. బలంగా , సిల్కీగా మెరిసేలా చేయడానికి ఆహారంలో గుడ్లను తీసుకోవాలి. జుట్టు పెరుగుదలను మెరుగుపరిచే బయోటిన్ రిచ్ డైట్ అవుతుంది.
బెర్రీస్ : జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో బెర్రీస్ ఎంతో మేలు చేస్తాయి. వాటిలో సమ్మేళనాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటంతోపాటు జుట్టు విరిగిపోకుండా చేస్తాయి. అంతేకాదు పెరుగుదులను వేగవంతం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, సీ విటమిన్ జుట్టును సంరక్షిస్తుంటాయి.

పాలకూర : జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతేకాదు జుట్టు పెరుగుదలకు పాలకూర తోడ్పడుతుంది. ఇందులో ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, సి పుష్కలంగా లభిస్తాయి. జుట్టు పగిలిపోకుండా జుట్టును సిల్కీగా, దృఢంగా మారుస్తుంది.
చిలగడ దుంపలు : విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. జుట్టు వేగంగా పెరిగేందుకు ఇద దోహదపడుతుంది. సెబమ్ ఉత్పత్తిని ప్రభావితం చేసి జుట్టు రాలడాన్ని ఆపేస్తుంది. జుట్టు పెరుగుదలలో మంచి పాత్ర పోషిస్తుంది.
అవకాడో : జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు అవకాడోను తినొచ్చు. ఇందులో విటమిన్ ఇతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇది ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది. కొన్నిసార్లు ఆక్సీకరణ ఒత్తిడివల్ల జుట్టు రాలుతుంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి అవకాడో సహాయపడుతుంది.
ఫ్యాటీ ఫిష్ : సాల్మన్, హెర్రింగ్ , మాకేరెల్ వంటి కొవ్వు చేపలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. జుట్టు పెరుగుదలను మెరుగుపరచడమే కాకుండా మందంగా చేస్తుంది. విటమిన్ డి మూలాల్లో ఇది ఒకటి. జుట్టు పెరుగుదలకు దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.












Click it and Unblock the Notifications