ఎముకలు బలంగా ఉండటానికి ఇవి తినండి
ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించేవారు ఎప్పటికీ ఆరోగ్యవంతులుగానే ఉంటారు. ఎముకలను దృఢపరిచేందుకు కొన్ని ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తీసుకుంటుండాలి. వీటివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నాన్ వెజ్ తినకుండానే ఎముకలను ఎలా బలోపేతం చేయవచ్చో తెలుసుకుందాం.
రాగులు: కాల్షియం ఉంటుంది. వీటిని తీసుకోవడంద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. అలాగే రాగుల్లో విటమిన్ డి కూడా ఎక్కువే. ఇవి రెండూ ఎముకల సాంద్రతను పెంచుతాయి.

బచ్చలికూర: ఆకుపచ్చ కూరగాయాల్లో కాల్షియం ఉంటుంది. ఎముకలకు ఇది అత్యంత కీలకమైనది. పాలకూరలో కాల్షియం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. రోజువారీ అవసరమైన కాల్షియంలో 25 శాతం లభిస్తుంది. ఐరన్, విటమిన్ ఏ కూడా ఉంటుంది.
చీజ్: ఎముకలు బోలుగా అవకుండా నివారిస్తుంది. రోజువారి జీవితంలో దీన్ని భాగంగా చేసుకోవాలి. ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. చిన్న పిల్లలకు కూడా దీన్ని తినిపించాలి.
టోఫు: శరీరంలో పోషకాల లోపాన్ని ఇది భర్తీ చేస్తుంది. దీన్ని తీసుకోవడంవల్ల శరీరానికి ప్రొటీన్ తోపాటు అనేక పోషకాలు అందుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
సోయాబీన్స్: ఇందేలో ప్రోటీన్ , కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు దీన్ని తీసుకోవడంద్వారా ఎముకలు బలోపేతమవుతాయి.
పాల ఉత్పత్తులు: పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులను రోజూ తీసుకుంటుండాలి. వీటిల్లో కాల్షియం , విటమిన్ డి పుష్కలంగా ఉండటంతోపాటు ప్రొటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.
బాదం: ఎముకలకే కాకుండా జట్టు, కళ్లకు కూడా చాలా మంచిది కాల్షియంతోపాటు విటమిన్ ఇ, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి.












Click it and Unblock the Notifications