స్పైసీ 'గోంగూర పన్నీర్ కర్రీ'.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..!
తెలుగు రాష్ట్రాల్లో గోంగూర వంటకానికి భారీ ఫ్యాన్స్ ఉంటారు. గోంగూరతో రకరకాల వంటలు చేసుకుంటారు. పచ్చడితో పాటు ఇతర కూరల్లో వాడుతుంటారు. అయితే సూపర్ టేస్టీ గోంగూర పన్నీర్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా..? ఇలా చేస్తే గోంగూర పన్నీర్ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. గోంగూర పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు..? తయారీ విధానం ఏంటి..?
గోంగూర పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. గోంగూర, పన్నీర్, టమాటోలు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, పసుపు, కారం, ఆవాలు, ఎండు మిర్చి, కొత్తిమీర, ఉప్పు తగినంత, ఎండుమిర్చి, నూనె తగినంత తీసుకోవాలి. ఇక గోంగూర పన్నీర్ కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి.
నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. అలా మగ్గిన తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేయాలి. అలా గోంగూర మెత్తగా దగ్గరకు ఉడికేంత వరకూ వేయించుకోవాలి.

ఆ తర్వాత ఇందులో టమాటో గుజ్జు వేయాలి. ఆ తర్వాత ఇందులో నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో వేడి నీటిలో ఉంచిన పన్నీర్ ముక్కలను వేయాలి. అలా మరో 5 నిమిషాలపాటు కలుపుకోవాలి. చివరగా పైన కొత్తిమీర చల్లుకుంటే సరి.. సూపర్ టేస్టీ గోంగూర పన్నీర్ కర్రీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications