పిల్లలకు ఇష్టమైన 'గులాబ్ జామున్'.. ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోండి..
గులాబ్ జామున్ అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు ఎగిరి గంతేస్తారు. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే గులాబ్ జామున్ అంటే అందరికీ నోరూరుతుంది. మరి బయట దొరికే విధంగా కాకుండా సూపర్ టేస్టీగా ఇంట్లోనే గులాబ్ జామున్ ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇక్కడ చూద్దాం..
సూపర్ టేస్టీ గులాబ్ జామున్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. ఖోవా ఒక కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా చిటికెడు, పాలు అవసరమైతేనే, నూనె లేదా నెయ్యి ఫ్రైకి తీసుకోవాలి. ఇక పాకం కోసం చక్కెర ఒక కప్పు, నీళ్లు ఒక కప్పు, యాలకులపొడి పావు టీ స్పూన్, రోజ్ వాటర్ ఒక టీ స్పూన్ తీసుకోవాలి. ఇక గులాబ్ జామున్ తయారీ విధానం చూస్తే.. ముందుగా ఖోవా, మైదా, బేకింగ్ సోడా కలిపి మృదువైన పిండిగా చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ మాదిరి రౌండ్ గా చేయండి. పాన్ లో చక్కెర, నీరు వేసి పాకం తయారు చేయండి.

యాలకుల పొడి, రోజ్ వాటర్ ను వేసి పాకం సిద్ధం చేయండి. నూనె వేడి చేసి తక్కువ బాల్స్ పై గోల్డెన్ మంటపై గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకూ వేయుంచుకోవాలి. వేయించిన జామున్ ను వేడి పాకంలో వేయాలి. 10-15 నిమిషాల పాటు నాన బెట్టుకోవాలి. అంతే సూపర్ టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications