బట్టతలకు ఇక గుడ్ బై.. 20 రోజుల్లోనే జుట్టు పెరుగుదల..
నేటి యువతను బట్టతల సమస్య తీవ్రంగా వేధిస్తున్న విషయం తెలిసిందే. దీని కారణంగా ఎంతో మంది మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారు. బట్టతలతో నలుగురిలోకి వెళ్లలేక ఆవేదన చెందుతున్నారు. పాతికేళ్లకే బట్టతల వచ్చేస్తున్న క్రమంలో యువత మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే బట్టతల రావడానికి రకరకాల కారణాలు ఉండగా.. అందులో మొదటిది వంశపారంపర్య సమస్యగా వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బట్టతల వచ్చాక బాధపడే కంటే.. అది రాక ముందే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అయితే బట్టతలతో బాధపడుతున్న యువతకు చైనా గుడ్ న్యూస్ చెప్పింది. చైనాలోని నేషనల్ తైవాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. సహజమైన కొవ్వు ఆమ్లాలతో తయారు చేసిన ఓ సిరమ్ ద్వారా కేవలం మూడు వారాల్లోనే అంటే 20 రోజుల్లోనే జుట్టును పునరుద్ధరిస్తోంది. ఈ సిరమ్ ను అప్లై చేసిన చోట నిద్రాణంలో ఉన్న జుట్టు కుదుళ్ల మూలాలను మేల్కొలుపుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సిరమ్ ను ఎలుకలతోపాటు ఓ ప్రొఫెసర్ కాలుపై ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు స్పష్టం చేశారు.

ఎడిపోసైట్ లీపోలీసిస్ యాక్టివేట్స్ ఎపీథిలియల్ స్టెమ్ సెల్స్ ఫర్ హెయిర్ రీ జనరేషన్ థ్రూ ఫ్యాటీ యాసిడ్ మెటాబోలిక్ సిగ్నలింగ్ అనే టైటిల్ కలిగిన రీసెర్చ్ పేపర్ ను సెల్ మెటాబోలిజం అనే కథనంలో ప్రచురించారు. నేషనల్ తైవాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరిపారు. ఫ్యాటీ యాసిడ్స్ తో సిరమ్ ను తయారు చేశారు. తొలుత ఎలుకలపై ఈ సిరమ్ ను ప్రయోగించగా 10 నుంచి 11 రోజుల్లోనే సత్ఫలితాలు వచ్చినట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications