రోటి పచ్చళ్ళలో ఫుల్ పోషకాలు.. రోటి పచ్చళ్ళతో ఆరోగ్య ప్రయోజనాలివే!

చాలామంది పచ్చళ్ళు తినడాన్ని ఇష్టపడతారు. ప్రతిరోజు భోజనంలో పచ్చడి లేనిదే వాళ్లకి భోజనం పూర్తికాదు. బయట హోటల్లో భోంచేసినా కూడా కచ్చితంగా పచ్చళ్ళ కోసం వెతుక్కుంటూ ఉంటారు. అయితే పచ్చళ్ళు తినడం మంచిదేనా? ఎటువంటి పచ్చళ్ళు తినాలి? పచ్చళ్ళు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అనేవి ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి.

రోటి పచ్చళ్ళతో ఆరోగ్యం
మన భారతీయ వంటలలో పచ్చళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. పచ్చళ్ల ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అందుకే వారంలో కనీసం మూడు సార్లు ఏదో ఒక పచ్చడిని ఆహారంలో భాగంగా చేసుకోవాలని చెబుతారు. అయితే నిలువ పచ్చళ్ల కంటే రోటి పచ్చళ్ళతో ఆరోగ్యం బాగుంటుందని రోటి పచ్చళ్ళు మన శరీరానికి కావాల్సిన పోషకాలను ఇస్తాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

hand pounded chutneys are very good for health these are the health benefits with hand made chutneys

రోటి పచ్చళ్ళు ఇలా చేసి తింటేనే బాగుంటుంది
అయితే రోటి పచ్చళ్లను చేసుకునే వారు మిక్సీలు, వెట్ గ్రైండర్లలో కాకుండా రోట్లోనే దంచుకుని చేసుకుంటే బాగుంటుంది. రోట్లో దంచి చేసిన పచ్చళ్ళ లో ఆయా కూరగాయలకు సంబంధించిన పోషకాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. రోట్లో చేసిన పచ్చడిని తినడం వల్ల ఆ పదార్థాలలో ఉన్న సుగుణాలన్నీ మన శరీరానికి అందుతాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

రోటి పచ్చళ్ళు తింటే ఈ ప్రయోజనాలు
ఇక రోటి పచ్చళ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే రోటి పచ్చళ్ళు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరుస్తాయి.తద్వారా శరీరంలోని కణాలు రక్తంలోని గ్లూకోస్ ను మరింత సమర్థంగా ఉపయోగించుకుంటాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు విపరీతమైన అలసటకు గురవుతారు. అటువంటివారు రోటి పచ్చళ్ళు తినడం వల్ల ఆ అలసట దూరమవుతుంది.

రోటి పచ్చళ్ళతో ఆరోగ్యం
అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారికి రోటి పచ్చళ్ళు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. రోటి పచ్చళ్లను తినడం వల్ల మన శరీరంలో విటమిన్ డి, విటమిన్ బి 12 వంటి లోపాలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యానికి రోటి పచ్చళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ తో బాధపడేవారు రోటి పచ్చళ్ళతో చెడు కొలెస్ట్రాల్ బారి నుండి కాపాడుకోవచ్చు .

రోటి పచ్చళ్ళలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం
రోటి పచ్చళ్ళ కోసం ఉపయోగించే ఆకుకూరలు, కూరగాయలు, వెల్లుల్లి, అల్లం వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇవి మన శరీరానికి కావలసిన మంచి కొవ్వును ఇచ్చి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అయితే రోటి పచ్చళ్లను తినేవారు అందులో కాస్త ఉప్పుకారాలు తక్కువ వేసుకుని తింటే మంచిది. ఇక ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునేవారు సంతానలేమి సమస్యలతో బాధపడే వారు కూడా రోటి పచ్చళ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+