శరీరానికి ప్రతిరోజు విటమిన్ సి అవసరం.. ఎక్కడ దొరుకుతుందంటే
మన శరీరానికి ప్రతిరోజు విటమిన్ సి అవసరమవుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు.. మనిషి మానసిక స్థితిని కూడా మెరుగుపరచడంతోపాటు ఉత్సాహాన్ని, హుషారును కలిగిస్తుంది. మెదడులోని నాడీ సమాచార వాహికల ఉత్పత్తికి విటమిన్ సి అత్యవసరం. డోపమైన్ అనే నాడీ సమాచార వాహకం సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలగజేస్తుంది. అందుకే దీన్ని సంతోష రసాయనం అని పిలుస్తుంటారు. విటమిన్ సి సరిపోకపోతే డోపమైన మోతాదులు పడిపోతాయి.
మనిషిలో నార్ ఎపినెఫ్రిన్ మోతాదులు పడిపోతే నిరాశ, ఆందోళన వంటివి తలెత్తుతాయి. అనేక మానసిక వ్యాధులు దీంతో ముడిపడివున్నాయి. డోపమైన్ నార్ ఎపినెఫ్రిన్ లు మెదడులో వాపు ప్రక్రియను తలెత్తకుండా చూస్తాయి. ప్రస్తుతం మానసిక వైద్యులు దీన్ని నిలవరించడం ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. మెదడుకు, పేగులకు మధ్య బలమైన బంధం ఉంటుంది. పేగుల్లో వాపు ప్రక్రియను నిలవరించడం కీలకం. అందుకు విటమిన్ సి తోడ్పడుతుంది. దీన్నుంచి కోలుకోవాలంటే ఎక్కువ బలం అవసరం.

విటమిన్ సితో కేలరీలు లభించకపోయినా శక్తి వస్తుంది. దీనివల్ల తరుచు నిరాశ, కుంగుబాటు, ఆందోళనకు గురవుతున్న ట్లు భావిస్తే విటమిన్ సి లభించే పదార్థాలు తింటుండాలి. ప్రతిరోజు మనకు 65 నుంచి 90 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం. నారింజ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు, క్యాప్సికం, బ్రకోలీ వంటివాటిల్లో దండిగా ఉంటుంది. ఒక్క నారింజ పండుతోనే 82 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. క్యాప్సికం, బ్రకోలీలో కూడా అధికంగా ఉంటుంది. ఎర్ర క్యాప్సికంలో 342 మిల్లీగ్రాముల బ్రకోలీలో 89 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇంత తేలికగా విటమిన్ సి, దీంతోపాటు హుషారును పొందొచ్చు. ఎందుకాలస్యం.. మీరు కూడా తీసుకోండి.












Click it and Unblock the Notifications